పారాచూట్‌ రెజిమెంట్‌లో శిక్షణను ప్రారంభించిన ధోని ..

Update: 2019-07-25 11:44 GMT

ప్రపంచ కప్ లో తీవ్ర విమర్శలు ఎదురుకున్నాడు ధోని . ఇక వరుస క్రికెట్ మ్యాచ్ లతో బిజీగా ఉన్న నేపధ్యంలో ధోని రెండు నెలల పాటు క్రికెట్ కి విశ్రాంతిని తీసుకున్న సంగతి తెలిసిందే .. అయితే అ తర్వాత భారత ఆర్మీలోని పారాచూట్‌ రెజిమెంట్‌లో తన శిక్షణ ప్రారంభించాడు ధోని . బుధవారం బెంగుళూరులో తన శిక్షణను ప్రారంభించిన ధోని అక్కడ పారాచూట్ రెజిమెంట్‌లోని తన బెటాలియన్‌తో కలిశాడు. భారత ఆర్మీ పారాచూట్‌ రెజిమెంట్‌ విభాగంలో ధోనీకి 2011లో గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా ఇచ్చిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News