వారేవా ధోని : ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు
ధోని ఒక్క సిక్స్ కొడితేనే స్టేడియం వావ్ అంటుంది. అలాంటిది వరుసుగా అయిదు బంతుల్లో అయిదు సిక్సులు కొడితే ఇంకేలా ఉంటుందో ఉహించుకోండి
ధోని ఒక్క సిక్స్ కొడితేనే స్టేడియం వావ్ అంటుంది. అలాంటిది వరుసుగా అయిదు బంతుల్లో అయిదు సిక్సులు కొడితే ఇంకేలా ఉంటుందో ఉహించుకోండి. అవును ఐపీఎల్ 2020 సీజన్ ప్రాక్టిస్ కి ముందు చిన్నస్వామి స్టేడియంలో సురేశ్ రైనాతో కలిసి నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన ధోని వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టాడు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఈ వీడియోను ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్ షేర్ చేసింది.
గత ఏడాది ఇంగ్లాండ్ లో జరిగిన ప్రపంచ కప్ తర్వాత ఆటకు కొంతకాలం దూరం అయిన ధోని ఆర్మీ ఆఫీసర్ గా రెండు నెలల పాటు ఇండియన్ ఆర్మీలో పనిచేసి జవాన్‌గా దేశానికి సేవలను అందించాడు. ఆ తర్వాత వైల్డ్‌గ్రాఫ్ ఫొటో గ్రాఫర్, పిచ్ క్యూరెటర్ గా కనిపించాడు. ఇక ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్ ఉండడంతో మళ్ళీ క్రికెట్ పై ఫోకస్ చేశాడు. రైనాతో కలిసి నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ చూడచక్కని షాట్లతో అలరించాడు..
ఇక ఐపీఎల్ 2020 సీజన్ మార్చి 29 నుంచి మొదలవుతున్నాయి. ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తన తొలి మ్యాచ్ ని డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది. ఇప్పటివరకు మూడుసార్లు ఐపీఎల్ టైటిల్ ని సొంతం చేసుకున్న చెన్నై ఈ సారి కూడా సొంతం చేసుకోవాలని చూస్తోంది.
BALL 1⃣ - SIX
— Star Sports Tamil (@StarSportsTamil) March 6, 2020
BALL 2⃣ - SIX
BALL 3⃣ - SIX
BALL 4⃣ - SIX
BALL 5⃣ - SIX
ஐந்து பந்துகளில் ஐந்து சிக்ஸர்களை பறக்கவிட்ட தல தோனி!
முழு காணொளி காணுங்கள் 📹👇
#⃣ "The Super Kings Show"
⏲️ 6 PM
📺 ஸ்டார் ஸ்போர்ட்ஸ் 1 தமிழ்
📅 மார்ச் 8
➡️ @ChennaiIPL pic.twitter.com/rIcyoGBfhE