ధోని రీఎంట్రీ కోసం పాక్ ఫ్యాన్స్ వెయిటింగ్
గత ఏడాది ఇంగ్లాండ్ లో జరిగిన ప్రపంచ కప్ తర్వాత ఆటకు కొంతకాలం దూరం అయిన ధోని ఆర్మీ ఆఫీసర్ గా రెండు నెలల పాటు
గత ఏడాది ఇంగ్లాండ్ లో జరిగిన ప్రపంచ కప్ తర్వాత ఆటకు కొంతకాలం దూరం అయిన ధోని ఆర్మీ ఆఫీసర్ గా రెండు నెలల పాటు ఇండియన్ ఆర్మీలో పనిచేసి జవాన్‌గా దేశానికి సేవలను అందించాడు. ఆ తర్వాత వైల్డ్‌గ్రాఫ్ ఫొటో గ్రాఫర్, పిచ్ క్యూరెటర్ గా కనిపించాడు. ఇక ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్ ఉండడంతో మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టి తన అభిమానులకి తన ఆటను చూపించేందుకు సిద్దం అవుతున్నాడు.
గతకొంత కాలం ఆటకు దూరంగా ఉన్న ధోనీ రీఎంట్రీ కోసం భారత్ అభిమానులే కాదు, పాకిస్థాన్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ తరహాలో పాక్ గడ్డపై జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఓ మ్యాచ్‌ని చూసేందుకు వెళ్ళిన ఓ అభిమాని ధోని జెర్సీని ధరించి అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యపరిచాడు. పీఎస్‌ఎల్‌లో ఆడుతున్న ఇస్లామాబాద్ యునైటెడ్ టీమ్‌కి మద్దతు తెలిపేందుకు వచ్చిన అతను ధోని పేరుతో జెర్సీని ధరించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Bhai in Stadium!
— Shehzad-Ul-Hassan (@shehzad441) March 8, 2020
Stadium was overcrowded. Full support for @IsbUnited
Missing @msdhoni @PSL pic.twitter.com/zuUsZoNT1s
ఇక ఐపీఎల్ 2020 సీజన్ మార్చి 29 నుంచి మొదలవుతున్నాయి. ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తన తొలి మ్యాచ్ ని డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది. ఇప్పటివరకు మూడుసార్లు ఐపీఎల్ టైటిల్ ని సొంతం చేసుకున్న చెన్నై ఈ సారి కూడా సొంతం చేసుకోవాలని చూస్తోంది.
వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు :
ఐపీఎల్ 2020 సీజన్ ప్రాక్టిస్ కి ముందు చిన్నస్వామి స్టేడియంలో సురేశ్ రైనాతో కలిసి నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన ధోని వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టాడు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఈ వీడియోను ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్ షేర్ చేసింది.