Most Centuries In IPL History: అత్యధిక సెంచరీలు చేసింది వీరే...
Most Centuries In IPL History: T20లో సెంచరీ చేయడం అంత ఈజీ కాదు. వన్డేలోలా కుదురుకున్నాక కొడతా అంటే ఇక్కడ చెల్లదు.
Most Centuries In IPL History: T20లో సెంచరీ చేయడం అంత ఈజీ కాదు. వన్డేలోలా కుదురుకున్నాక కొడతా అంటే ఇక్కడ చెల్లదు. వచ్చీ రాగానే బౌండరీల మోత మోగించాల్సిందే. అప్పుడే శతకం సాధ్యమవుతుంది. నిన్న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ సామ్సన్ సెంచరీ బాదేశాడు. అతడిదే ఐపీఎల్ 2021 సీజన్ లో మొదటి సెంచరీ. సంజూ ఆట తీరు ప్రేక్షకుల్లో మంచి జోష్‌ను పెంచింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్‌ల్లో నిన్న పంజాబ్, రాజస్థాన్ మ్యాచే హై ఓల్టేజ్ నింపింది. పంజాబ్ కింగ్స్‌పై సామ్సన్ బౌండరీలతో విరుచుకుపడటంతో చివరి వరకు థ్రిల్లింగ్ పంచింది.
జట్టును గెలిపించలేకపోయినా సామ్సన్ చివరి వరకూ పోరాడాడు. కేవలం 63 బంతుల్లో 119 పరుగులు (12 ఫోర్లు, 7 సిక్స్‌లతో ) సాధించాడు సంజూ. ఇది సామ్సన్‌కు ఐపీఎల్‌లో మూడో సెంచరీ. అయితే ఈ లీగ్‌లో అత్యధిక సెంచరీలు కొట్టిన జాబితాలో చేరి, నాలుగో స్థానంలో నిలిచాడు.
ఇప్పటివరకూ ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన వారిని ఓసారి పరిశీలిద్దాం.
1. క్రిస్ గేల్: 6 సెంచరీలతో క్రిస్ గేల్ మొదటి స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు 133 మ్యాచుల్లో 132 ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే 351 సిక్సులతోనూ మొదటి స్థానంలో నిలిచాడు.
2. విరాట్ కోహ్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ 5 సెంచరీలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు 193 మ్యాచుల్లో 185 ఇన్సింగ్సులు ఆడాడు. అలాగే 5911 పరుగుల సాధించి అత్యధిక పరుగుల జాబితాలోనూ ముందు నిలిచాడు.
3. డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్: 4 సెంచరీలతో డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్ మూడో స్థానంలో నిలిచారు.
4. ఏబీ డివిలియర్స్, సంజూ సామ్సన్: ఇప్పటి వరకు ఏబీ డివిలియర్స్ మూడు సెంచరీలతో నాలుగో స్ఠానంలో ఉన్నాడు. నిన్నటి సెంచరీతో సంజూ అతని సరసన చేరాడు. ఏబీ డివిలియర్స్ 157 ఇన్నింగ్సుల్లో ఈ ఘనత సాధించగా.. కేవలం 104 ఇన్నింగ్సుల్లో సంజూ 3 సెంచరీలను నమోదు చేశాడు.