సిక్సర్ల 'రూట్' లో 'మోర్గాన్' మోత!

Update: 2019-06-18 12:37 GMT

వీర బాదుడు అంటే ఇదే. బంతి పాడడం ఆలస్యం.. ఫ్రెండ్ దాటిపోతోంది. పాపం ఆఫ్ఘానిస్తాన్ బౌలర్లు! ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ ఇయాన్ మోర్గాన్ కు ఎక్కడ బంతివేయాలో.. ఎలా వేయాలో తెలీక.. అయోమయం లో పడిపోయారు. కేవలం 57 బంతుల్లో సెంచరీ బాదేశాడు మోర్గాన్. ప్రపంచకప్‌లో వేగవంతమైన నాలుగో శతకం ఇది. ఇక అతనితో పాటు క్రీజులో ఉన్న రూట్ కూడా శతక వేటలో బిజీగా ఉన్నాడు. వీరిద్దరి మోత తో ఇంగ్లాండ్ జట్టు 45 ఓవర్లకు 323 పరుగులు చేసింది. రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఇంకా ఐదు ఓవర్లు ఉన్న పరిస్థితిలో వీరిద్దరి విధ్వాంశం ఇలాగే కొనసాగితే ఇంగ్లాండ్ జట్టు 370 పరుగులు చేసే అవకాశం ఉంది. మోర్గాన్ 118 పరుగులు, రూట్ 83 పరుగులు ఇప్పటి వరకూ చేశారు. 

Tags:    

Similar News