Azharuddin: ఈడీ విచారణకు హాజరైన అజహరుద్దీన్

Mohammad Azharuddin: అజహారుద్దీన్ మంగళవారం ఈడీ విచారణకు హాజరయ్యారు.

Update: 2024-10-08 07:12 GMT

Azharuddin: ఈడీ విచారణకు హాజరైన అజహరుద్దీన్

Mohammad Azharuddin: అజహారుద్దీన్ మంగళవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో అక్రమాలపై నమోదైన కేసులో ఆయన ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.

ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ బాల్స్, జిమ్ పరికరాలు, సీట్లు, ఫైర్ కిట్లు, ఇతర సామాగ్రి కొనుగోలు విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దీని ఆధారంగా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. తనపై తప్పుడు ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అజహారుద్దీన్ చెప్పారు. ఈడీ విచారణకు హాజరయ్యే సమయంలో ఆయన మీడియా ప్రతినిధులకు ఈ విషయం చెప్పారు.

Tags:    

Similar News