వైరల్ : అమ్మ మనస్సు ..ఆట మధ్యలో బిడ్డకు పాలిచ్చిన ప్లేయర్

Update: 2019-12-10 12:06 GMT
Mizoram Volleyball Player Breastfeeds Child

కణకణలాడే ఎండకు శిరసు మాడినా మనకు తల నీడను అందించే చెట్టే అమ్మ, చారేడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ అంటూ ఓ కవి ఎంత చక్కగా వర్ణించారో. అయితే పసిపిల్లల ఆకలి అమ్మకే తెలుస్తుంది. అందుకే అమ్మ ఎక్కడ ఉన్న పిల్లల ఆకాలి గురించి ఆలోచిస్తుంది. కాగా..  ఓ పిల్లాడికి చనుబాలు అందించి లాలిస్తుంది. ఓ క్రీడారినీ తన పిల్లాడికి ఆకలి వేస్తుందని తెలుసుకొని ఆట మధ్యలో పాలు ఇచ్చిన ఈ ఘటన మిజోరాంలో చోటుచేసుకుంది.

మిజోరాం చెందిన వాలీబాల్‌ క్రీడాకారిణి లాల్వేంట్లుం ఆటల పోటీలో విరామం దొరకగానే తన చిన్నారికి పాలుపట్టి మాతృత్వాన్ని చాటుకుంది. ఆమె ఆట మధ్యలో పాపాయికి పాలుపట్టిస్తున్న ఫోటోనూ నింగ్లిన్‌ హంగల్‌ అనే నెటిజన్‌ సోషల్ మీడియాలో షర్ చేశారు. దీంతో ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఓవైపు వాలీబాల్ ఆటపట్ల అంకిత భావాన్ని చూపిస్తూ.. నలుగురిలో చూస్తుండా 7నెలల బిడ్డకు పాలు పట్టిన దాన్ని చూసి అందూ మెచ్చుకుంటున్నారు. ఈ ఫొటో మిజోరాం రాష్ట్ర క్రీడా శాఖమంత్రి రాబర్ట్‌ రోమావియా దృష్టికి చేరింది. దీంతో ఆయన లాల్వేంట్లుం రూ. 10 వేలు బహుమతిని ప్రకటించారు. కాగా.. లాల్వేంట్లుం ఆ అమ్మకు సలాం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. లాల్వేంట్లుం రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో పాల్గొన్నారు. సోమవాంరం జరిగి మ్యాచ్ లో ఆమె తన బిడ్డకు పాలుపట్టారు. 


 

Tags:    

Similar News