చీరకట్టులో బ్యాటింగ్ చేసిన టీమిండియా దిగ్గజ క్రికెటర్
టీమిండియా మహిళ దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ మరోసారి మైదానంలో అడుగుపెట్టారు.
టీమిండియా మహిళ దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ మరోసారి మైదానంలో అడుగుపెట్టారు. అయితే ఈ సారి ఆమె చీరకట్టుతో క్రికెట్ ఆడారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ అంటే షర్ట్ , ప్యాంటు ధరించి ఆడతారని అందరికీ తెలిసిందే. కానీ మిథాలీ రాజ్ చీర కట్టుకొని ఎందుకాడిందంటే అమ్మాయిలు కట్టుబాట్లను తెంచుకొని ఎదుగుతున్నారనేందుకు నిదర్శనంగా విథాలీ ఇలా మైదానంలోకి అడింది.
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ తొలిసారి చేరుకుంది. మార్చి 8న ఆదివారం అంతర్జాతీయ మహిళల దినోత్సవం రోజున డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో హర్మన్‌ప్రీత్ నాయకత్వంలోని టీమిండియా ఆడనుంది. ఈ సందర్భంగా.. మిథాలీతో ఓ ప్రత్యేక వీడియో రూపొందించారు. ఆ వీడియోకు ఓ క్యాప్షన్ కూడా జోడించారు. 'ప్రపంచకప్‌ను టీంఇండియా స్వదేశానికి తీసుకురావాలి' అనే సందేశాన్ని జోడించారు. ఈ వీడియోను విథాలీరాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు.
ఇక భారత అమ్మాయిల ఫైనల్ ప్రవేశం పట్ల సంతోషం వ్యక్తం చేసిన మిథాలీ రాజ్. ఓ క్రికెటర్‌గా.. సెమీస్‌లో ఇంగ్లండ్ జట్టును చూస్తే జాలేస్తుందని పేర్కొంది. సెమీస్‌లో ఆడకుండానే వర్షం కారణంగా ఇంగ్లండ్ జట్టు ఇంటికి చేరింది. దీంతో ఇంగ్లండ్ జట్టుకు వచ్చిన పరిస్థితి ఎవరికి రావద్దని భావిస్తున్నా. కానీ, నిబంధనలు అలాంటివి అంటూ పేర్కొంది. భారత అమ్మాయిలకు నా అభినందనలు అని మిథాలీ రాజ్ ట్వీట్ చేశారు.
20 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ ప్రయాణంలో ఎన్నో ఎదుర్కోని ఆటుపోట్లు కెప్టెన్‌గా మిథాలీ రాజ్ ఎదుర్కొన్నారు. క్రికెట్‌లో పురుషుల ఆదిపత్యం ఉన్న రోజుల్లోనే ఎదిగి దిగ్గజంగా మారారు. భారత మహిళా క్రికెట్‌కు ఎంత సేవ చేశారు. కట్టుబాట్లను దాటి అమ్మాయిల ఆటకు దశ, దిశ మరారు. మిథాలీ క్రికెట్ చేసిన సేవలకు ఖేల్ రత్న, పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు. కాగా.. మిథాలీ రాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా కూడా తెరకెక్కుతోంది.