IPL 2024: ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైనోడు, చెత్త బౌలింగ్ అంటూ ట్రోల్స్.. కట్‌చేస్తే.. కేకేఆర్‌ను ఛాంపియన్‌గా మార్చి స్ట్రాంగ్ కౌంటర్..!

Mitchell Starc: ఐపీఎల్ 2024 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ మిచెల్ స్టార్క్‌ను రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Update: 2024-05-27 05:37 GMT

IPL 2024: ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైనోడు, చెత్త బౌలింగ్ అంటూ ట్రోల్స్.. కట్‌చేస్తే.. కేకేఆర్‌ను ఛాంపియన్‌గా మార్చి స్ట్రాంగ్ కౌంటర్..!

Mitchell Starc: ఐపీఎల్ 2024 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ మిచెల్ స్టార్క్‌ను రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో లీగ్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా మిచెల్ స్టార్క్‌ నిలిచాడు. ఆస్ట్రేలియన్ పేసర్ కోసం అంత డబ్బు ఖర్చు చేయడంపై చాలా మంది ఎగతాళి చేశారు. హేళనగా మాట్లాడుతూ జోకులే వేసుకున్నారు. అయితే, టోర్నీ ఆరంభంలో స్టార్క్ పేలవ ప్రదర్శన చేయడంతో.. ఈ వ్యాఖ్యలకు బలం చేకూరింది. కానీ, స్టార్క్ ఐపీఎల్ ప్లేఆఫ్స్, ఫైనల్స్‌లో తన ఆటతో ట్రోలర్స్‌కు గట్టిగా సమాధానమిచ్చాడు. కోల్‌కతాను మూడోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా మార్చడంలో తన పాత్ర పోషించాడు. 14 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టడంతో పాటు రెండు క్యాచ్‌లు కూడా అందుకున్నాడు. దీని కారణంగా, అతను ఫైనల్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. మ్యాచ్ తర్వాత, స్టార్క్ తనపై లేవనెత్తిన ప్రశ్నలకు, జోకులపై ఘాటుగా సమాధానమిచ్చాడు.

బౌలింగ్‌తోనే సమాధానం..

స్టార్క్ మాట్లాడుతూ, నాపై చాలా జోకులు వేశారు. డబ్బు గురించి వాళ్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. నేను ఇప్పుడు అనుభవజ్ఞుడిని. వీటన్నింటిని ఎదుర్కోంటూ బౌలింగ్ అటాక్‌ను నడిపించడానికి నాకు సహాయపడింది. నాకు వ్యక్తిగతంగా ఇది సరదాగా ఉంటుంది. మాకు అద్భుతమైన బౌలింగ్ ఉంది' అంటూ చెప్పుకొచ్చాడు.

ప్లేఆఫ్స్‌లో స్టార్క్ విధ్వంసం..

ఈ సీజన్‌లో స్టార్క్ 17 వికెట్లు తీశాడు. తొలి మ్యాచ్‌లలో అతను విఫలమయ్యాడు. ఆ సమయంలో అతని ఓవర్లలో చాలా పరుగులు పోవడంతో పాటు వికెట్లు కూడా రాలేదు. అయితే, టోర్నీ సాగుతున్న కొద్దీ ఫామ్‌లోకి వచ్చాడు. ప్లేఆఫ్స్‌లో తన పూర్తి ఫాంను సంతరించుకున్నాడు. క్వాలిఫయర్ 1లో మూడు వికెట్లు తీసి హైదరాబాద్‌ను ఓడించాడు. ఈ సమయంలో హైదరాబాద్ అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన ట్రావిస్ హెడ్‌ను మొదటి ఓవర్‌లోనే పెవిలియన్ చేర్చాడు. ఫైనల్‌లో రెండు వికెట్లు తీశాడు. వీరిలో అభిషేక్ శర్మ వికెట్ తొలి ఓవర్‌లోనే పడింది.

ఛాంపియన్‌గా ఎలా మారామంటే..

జట్టు విజయంపై స్టార్క్ మాట్లాడుతూ.. KKRకి ఇది గొప్ప రాత్రి. ఎంత అద్భుతమైన సీజన్. బహుశా రెండు అత్యంత ఉత్తేజకరమైన జట్లు ఫైనల్‌లో ఆడాయి. మాకు గొప్ప జట్టు ఉంది. అందరూ సహకరించారు. మేం నిలకడగా ఆడాం. ఇది మా విజయానికి ప్రధాన కారణం. టాస్‌ ఓడిపోవడంతో ముందుగా బౌలింగ్‌ చేసే అవకాశం వచ్చింది. నేను రెండు రాత్రుల క్రితం క్వాలిఫైయర్ 2ని చూసినప్పుడు, పిచ్ నుంచి ఏమి ఆశించాలో నాకు తెలియదు. కానీ, వికెట్లు తీయగల సత్తా ఉందని మా బౌలింగ్ చూపించింది' అంటూ చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News