ఆ స్టేడియంలో కరోనా పేషంట్.. 86వేల మంది మధ్యలో మ్యాచ్ వీక్షించిన బాధితుడు
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఫైనల్ పోరులో ఆసీస్ భారత్ పై 85 పరుగుల తేడా ఘనవిజయం సాధించి ఐదోసారి ప్రపంచ కప్ ఎగరేసుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 184 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 99 పరుగులకే ఆలౌటై నిరాశపరిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ ప్రపంచలోనే అరుదైన ఘనత సాధించింది. ఇక రికార్డు స్థాయిలో 86,174 మంది స్టేడియంలో ఆ మ్యాచ్ వీక్షించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మ్యాచ్ కు సంబంధించిన వార్త ఒకటి కలకలం రేపుతోంది.
మహిళల టీ20 ప్రపంచకప్ లో వీక్షించిన వారిలో ఒకరు కరోనా సోకినట్లు గుర్తించారు. మ్యాచ్ తిలకించిన వ్యక్తి కరోనా బారిన పడినట్లు ఆస్ట్రేలియాలోని ఆరోగ్య, హ్యూమన్ సర్వీసెస్ విభాగం ప్రకటించింది. తాజాగా కరోనా వైరస్ సోకిన వ్యక్తి నార్గ్ స్టాండ్ లోని లెవల్ 2లో 42ఎన్ సీట్లో కూర్చున్నట్లు ఎంసీజీ గుర్తిచింది. అయితే మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ( ఎంసీజీ) ప్రకటించిన దానిప్రకారం మిగతా వారికి వైరస్ సోకే అవకాశం తక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా ఆప్రదేశంలో ఇతరులకు ఆ వ్యక్తి వల్ల వైరస్ సోకే అవకాశాలు తక్కువని తెలిపింది. దీంతో ఆ ప్రదేశంలో కూర్చున్న ప్రేక్షకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఎవరికైనా కరోనా సోకినట్లు అనుమానం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపింది.