Mary Kom: బాక్సింగ్ కు వీడ్కోలు పలకట్లేదని మేరీకోమ్ క్లారిటీ

Mary Kom: బాక్సింగ్ కు వీడ్కోలు పలకట్లేదని మేరీకోమ్ క్లారిటీ

Update: 2024-01-25 06:36 GMT

Mary Kom: బాక్సింగ్ కు వీడ్కోలు పలకట్లేదని మేరీకోమ్ క్లారిటీ

Mary Kom: భారత బాక్సింగ్‌ దిగ్గజం, ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ మేరీకోమ్‌ ఓ స్కూల్‌ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆమె బాక్సింగ్ నుంచి రిటైర్మెంట్‌ తీసుకుంటున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై మేరీకోమ్‌ స్పందిస్తూ తాను రిటైర్మెంట్ పై ఎలాంటి ప్రకటనలు చేయలేదంటూ వివరణ ఇచ్చారు. తాను ఇప్పుడే బాక్సింగ్‌ను వీడబోనని స్పష్టం చేశారు. మేరీకోమ్‌ నిన్న అస్సాంలోని ఓ స్కూల్‌ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఆటల్లో ఇంకా ఏదో సాధించాలనే తపనతో ఉన్నా.. తనకు వయసు అడ్డంకిగా మారిందని మేరికోమ్ అన్నారు. వయోపరిమితి కారణంగా ఒలింపిక్స్‌, ఇతర పోటీల్లో పాల్గొనలేకపోతుని చెప్పారు.

తాను జీవితంలో అన్నీ సాధించానని.. నిజానికి ఇక రిటైర్‌ అవ్వాలని అన్నారు. దీంతో ఆమె బాక్సింగ్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై మేరీకోమ్‌ స్పందించారు. తాను బాక్సింగ్ నుంచి రిటైర్మెంట్‌ తీసుకుంటున్నట్లు సోషల్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయని.. అవన్నీ నిజం కాదని ఆమె వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని. ఆ ఈవెంట్‌లో విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు అలా మాట్లాడా తప్ప.. తాను ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించనని మేరికోమ్ తెలిపారు.

Tags:    

Similar News