India WTC 2025 Scenario: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2-2తో డ్రా అయినా.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్!
India WTC 2025 Scenario: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ రేసు రసవత్తరంగా ఉన్న విషయం తెలిసిందే. టాప్ 2లో నిలిచేందుకు భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా శ్రీలంక టీమ్స్ పోటీపడుతున్నాయి.
India WTC 2025 Scenario: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ రేసు రసవత్తరంగా ఉన్న విషయం తెలిసిందే. టాప్ 2లో నిలిచేందుకు భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా శ్రీలంక టీమ్స్ పోటీపడుతున్నాయి. ప్రస్తుతం భారత్ (61.11) అగ్రస్థానంలో ఉండగా.. దక్షిణాఫ్రికా (59.26) రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా (57.69), న్యూజిలాండ్ (50.00), శ్రీలంక (50.00) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. తాజాగా న్యూజిలాండ్‌పై సాధించిన ఇంగ్లండ్ కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు భారత్ అగ్రస్థానంలోనే ఉండగా.. ఆస్ట్రేలియాతో సిరీస్ అంటే మాములు విషయం కాదు. తొలి టెస్టులో ఓడిన ఆసీస్ తిరిగి పుంజుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే.. టీమిండియా సమీకరణాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ 3-1తో గెలిస్తే:
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 5-0, 4-1, 4-0, 3-0తో భారత్ కైవసం చేసుకుంటే.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అదే సమయంలో ఆస్ట్రేలియా రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ఆస్ట్రేలియాపై సిరీస్‌ని 3-1తో కైవసం చేసుకున్నా.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ వెళుతుంది. అయితే దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టెస్టులో శ్రీలంక విజయం సాధించాలి. ఒకవేళ దక్షిణాఫ్రికా, శ్రీలంకల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ డ్రా అయినా.. భారత్ 3-1తో గెలిస్తే ఫైనల్‌కు చేరుకుంటుంది.
3-2తో భారత్ గెలిస్తే:
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-2తో గెలిచినా.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ అర్హత సాధిస్తుంది. కానీ ఆస్ట్రేలియాతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో శ్రీలంక కచ్చితంగా ఒక మ్యాచ్‌లో గెలవాలి లేదా డ్రా చేసుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. ఆస్ట్రేలియా, శ్రీలంక సిరీస్ 2025 జనవరి 29 నుంచి లంక గడ్డపై జరుగనుంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2-2తో డ్రా అయితే:
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ 2-2తో డ్రా అయినా.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడానికి అవకాశాలు ఉంటాయి. ఇది సాధ్యపడాలంటే.. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0 తేడాతో గెలవాలి. అంతేకాదు ఆస్ట్రేలియాతో జరిగే 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను లంక 1-0తో కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర జట్లపై ఆధారపడకుండా నేరుగా ఫైనల్‌కు వెళ్లాలంటే.. 3-0తో అయినా ఆస్ట్రేలియాపై గెలవాలి. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. ఇక అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి రెండో టెస్ట్ ఆరంభం కానుంది. ఇది డే/నైట్ టెస్ట్ మ్యాచ్. తమ దేశానికి వచ్చే జట్లతో ఆసీస్ ఒక డే/నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడుతుందన్న సంగతి తెలిసిందే.