Venkata Datta Sai: ఐపీఎల్ టీమ్‌తో సంబంధం.. పీవీ సింధుకు కాబోయే భర్త ఫుల్ డీటెయిల్స్ ఇవే..!
Venkata Datta Sai: భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు త్వరలో పెళ్లిపీటలెక్కుతున్న విషయం తెలిసిందే.
Venkata Datta Sai: భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు త్వరలో పెళ్లిపీటలెక్కుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్త సాయితో ఆమె వివాహం జరగనుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో డిసెంబర్ 22న సింధు, సాయిల పెళ్లి జరగనుంది. ఈ విషయాన్ని సింధు తండ్రి పీవీ రమణ వెల్లడించారు. ఇక సింధుకు కాబోయే భర్త సాయి గురించి నెటిజెన్స్, ఫాన్స్ ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో సాయి ఫుల్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్త సాయి.. ఫౌండేషన్ ఆఫ్ లిబరల్ అండ్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ నుంచి లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో డిప్లొమా చేశారు. 2018లో ఫ్లేమ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) పట్టా అందుకున్నారు. బెంగుళూరులోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేశారు. మాస్టర్స్ అనంతరం జేఎస్‌డబ్ల్యూ (జిందాల్ సౌత్ వెస్ట్)లో సాయి కెరీర్ ఆరంభించారు.
జేఎస్‌డబ్ల్యూలో సమ్మర్ ఇంటర్న్‌గా, ఇన్‌హౌజ్ కన్సల్టెంట్‌గా వెంకట దత్త సాయి పని చేశారు. విధుల్లో భాగంగా జేఎస్‌డబ్ల్యూ గ్రూపుకు చెందిన ఐపీఎల్ ప్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో సాయి పని చేశారు. ప్రస్తుతం పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఇందులోనే సోర్ ఆపిల్ అసెట్ మేనేజ్‌మెంట్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. పీవీ సింధుతో పెళ్లి ఖాయం అయిన నేపథ్యంలో సాయికి చెందిన లింక్డిన్ ప్రొఫైల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ టీమ్ నిర్వహణతో పోలిస్తే నా బీబీఏ డిగ్రీ తక్కువగానే అనిపించవచ్చని, ఈ రెండింటి నుంచి కావాల్సినంత విజ్ఞానం పొందానని పేర్కొన్నారు.
గతంలో పీవీ సింధుకు వెంకట దత్త సాయి లింక్డిన్‌లో రిప్లై ఇచ్చిన స్క్రీన్ షాట్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. 'లింక్డిన్‌లోకి స్వాగతం అంకుల్. ఈ ప్లాట్‌ఫామ్‌తో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి' అని సాయిని ఉద్దేశించి సింధు రాసుకొచ్చారు. ఇందుకు సాయి ఫన్నీగా రిప్లే ఇచ్చారు. 'నాన్నను స్వాగతించినందుకు థాంక్స్ సింధు' పేర్కొన్నారు. సింధు, సాయిల కుటుంబాలకు ఎప్పటినుంచో పరిచయం ఉంది. అయితే గత నెలలోనే వీరిద్దరికి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. ఈ విషయాన్ని పీవీ రమణ తెలిపారు. ఈ నెల 22న పెళ్లి వేడుకకు ముహూర్తం ఖరారు కాగా.. 24న హైదరాబాద్‌లో రెసెప్షన్ ఉంటుంది. 20 నుంచి పెళ్లి పనులు ఆరంభం అవుతాయి. జనవరి నుంచి సింధుకు వరుసగా టోర్నీలు ఉన్న కారణంగా ముందే పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు.