Jay Shah: ఐసిసి చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న జై షా ఏం చెప్పారంటే..

Jay Shah Takes Charge as ICC Chairman: నవంబర్ 30వ తేదీతో ఇప్పటివరకు ఐసిసి చైర్మన్‌గా ఉన్న గ్రెగ్ బార్క్లె పదవీ కాలం ముగిసిపోయింది. అందుకే ఈ ఆదివారం ఐసిసి కొత్త చైర్మన్‌గా జే షా చార్జ్ తీసుకున్నారు.

Update: 2024-12-01 16:27 GMT

Jay Shah Takes Charge as ICC Chairman: ఐసిసి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన జే షా డిసెంబర్ 1న ఆ బాధ్యతలు స్వీకరించారు. ఐసిసి చైర్మన్‌గా బాధ్యతలు తీసుకోవడంపై జే షా ఆనందం వ్యక్తంచేశారు. తనపై అంత నమ్మకం ఉంచిన ఐసిసి డైరెక్టర్స్, సభ్య దేశాల బోర్డులకు కృతజ్ఞతలు చెబుతూ ఒక ప్రకటన విడుదల చేశారు.

లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్ గేమ్స్‌తో క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లడమే ప్రస్తుతం తన ముందున్న కర్తవ్యం అని జే షా ప్రకటించారు. నవంబర్ 30వ తేదీతో ఇప్పటివరకు ఐసిసి చైర్మన్‌గా ఉన్న గ్రెగ్ బార్క్లె పదవీ కాలం ముగిసిపోయింది. అందుకే ఈ ఆదివారం ఐసిసి కొత్త చైర్మన్‌గా జే షా చార్జ్ తీసుకున్నారు.

ఐసిసి టీమ్‌తో పాటు సభ్య దేశాల క్రికెట్ బోర్డులతో కలిసి క్రికెట్‌ను మరిన్ని కొత్త దేశాలకు విస్తరించనున్నట్లు జే షా తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను ప్రేమించే క్రికెట్ ప్రియుల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయనున్నట్లు జే షా ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఈ క్రీడను మరింత మందికి చేరువ చేసే లక్ష్యంతో పనిచేయనున్నట్లు తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.


Tags:    

Similar News