Virat Kohli Injury: విరాట్ కోహ్లీకి గాయం.. రెండో టెస్ట్ నుంచి ఔట్?
Virat Kohli Injury: ఒకవేళ విరాట్ కోహ్లీ రెండో టెస్ట్ మ్యాచ్‌కు దూరమైతే.. భారత జట్టుకు భారీ పెద్దదెబ్బ తగులుతుంది.
Virat Kohli Injury: ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి గాయం అయినట్లు తెలుస్తోంది. కోహ్లీ కుడి మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. మోకాలికి బ్యాండేజీ వేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో విరాట్ ఫాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కింగ్ రెండో టెస్టులో ఆడతాడా? లేదా అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లోవిఫలమైన కోహ్లీ.. పెర్త్‌లో అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఫామ్‌లోకి వచ్చిన విరాట్.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మరింతగా సత్తాచాటాలని చూశాడు. అయితే డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో మొదలయ్యే రెండో టెస్టు కోసం ప్రాక్టీస్ చేస్తున్న కోహ్లీకి గాయం అయినట్లు తెలుస్తోంది. బీసీసీఐ మెడికల్ టీమ్ చికిత్స అనంతరం మోకాలికి బ్యాండేజీతో మైదానంలోకి వచ్చాడు. ప్రస్తుతం విరాట్ బాగానే నడుస్తున్నా.. అడిలైడ్‌లో జరిగే డే/నైట్ టెస్టుకు అందుబాటులో ఉంటాడో లేదో చూడాలి.
ఒకవేళ విరాట్ కోహ్లీ రెండో టెస్ట్ మ్యాచ్‌కు దూరమైతే.. భారత జట్టుకు భారీ పెద్దదెబ్బ తగులుతుంది. ఎందుకంటే.. పెర్త్‌లో సెంచరీ చేసి ఫామ్ అందుకున్న కోహ్లీకి అడిలైడ్ స్టేడియంలో అద్బుత రికార్డు ఉంది. అడిలైడ్‌లో ఆడిన 8 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో కింగ్ కోహ్లీ 63.62 సగటుతో 509 పరుగులు చేశాడు. 2014లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లలో (115, 141) సెంచరీలు చేశాడు. అలానే డే/నైట్ టెస్టుల్లో మంచి రికార్డు ఉంది. 300 పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి భారత ఆటగాడిగా కింగ్ కోహ్లీ మరో ఘనత అందుకుంటాడు. పింక్ బాల్ టెస్టుల్లో 277 రన్స్ బాదాడు.
ఇక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో విరాట్ కోహ్లీ మరో సెంచరీ బాదితే సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేస్తాడు. ఈ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా విరాట్, సచిన్ సంయుక్తంగా అగ్ర స్థానంలో ఉన్నారు. సచిన్ 65 ఇన్నింగ్స్‌ల్లో 9 సెంచరీలు చేయగా.. 44 ఇన్నింగ్స్‌లోనే విరాట్ 9 సెంచరీలు చేశాడు. మరో సెంచరీ చేస్తే సచిన్‌ను అధిగమిస్తాడు. ఈ జాబితాలో రికీ పాంటింగ్ రెండో స్థానంలో ఉన్నాడు. 51 ఇన్నింగ్స్‌లలో 8 సెంచరీలు బాదాడు. స్టీవ్ స్మిత్ (37 ఇన్నింగ్స్‌లు-8 సెంచరీలు,), మైకేల్ క్లార్క్ (40 ఇన్నింగ్స్‌లు-7 సెంచరీలు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.