క్రికెట్‌లో ఆ చెత్త రూల్ మార్చాలి

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ వా మరో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చాడు.

Update: 2020-01-03 11:51 GMT

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ వా మరో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చాడు. లెగ్ బైస్స్ ద్వారా పరుగులు ఇవ్వడాన్ని తీసేయాలని సూచించాడు. మార్క్ వా బిగ్ బాష్ లీగ్‌(బీబీఎల్)లో ప్రస్తుతం ఫాక్స్ క్రికెట్ తరుపున వ్యాఖ్యాతగా వ్యవహారిస్తున్నాడు. స్టార్స్-సిడ్నీ థండర్స్ జట్ల మధ్య జరిగిన మ్యా్చ్ సందర్భంగా మరో కామెంటేటర్ మైకేల్ వాన్‌తో లెగ్ బైలపై తన అభిప్రాయాన్ని తెలిపాడు.

క్రికెట్ లో లెగ్ బైలుతో పరుగులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఈ విధానాన్ని తీసి వేయాలని తెలిపాడు. ఈ సందర్భంగా మార్క్ వా మాట్లాడుతూ.. క్రికెట్‌లో ఒక రూల్‌ని మార్చాలి కనీసం టీ20ల్లోనైనా లగ్ బైలు లేకుండా చూడాలి. బంతిని బ్యాట్స్ మెన్ మిస్ చేస్తే పరుగులు ఇవ్వడం సరికాదు. అని మార్క్ వా వ్యాఖ్యానించాడు. దీంతో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మాట్లాడుతూ.. ఇది క్రికెట్లో భాగం మాత్రమేనని చాలా రూల్స్ మార్చాలని తెలిపాడు.

అందుకు మార్క్ వా ఇది కేవలం ఆటలో భాగమని నాకు కూడా తెలుసు. అయినప్పటీకి క్రికెట్లు దీనిని మనం మార్చలేమా? ఈ నిబంధనను ప్రవేశ పెట్టేటప్పుడు అతను బ్యాట్స్ మెన్ అయి ఉంటాడని చమత్కరించాడు. గత కొన్నేళ్లుగా క్రికెట్‌లో మార్పులు చేసుకున్నాయి. అందులో టీ20 క్రికెట్ యుకేలో 100 బంతుల క్రికెట్ ఆడటం తోపాట.. 2017 నుంచి నాలుగు రోజుల టెస్టులను మొదలు పెట్టింది. పూర్తి స్థాయిలో 2023లో కొనసాగించాలని ఐసీసీ నిర్ణయించింది.

నాలుగు రోజల టెస్టు మ్యాచ్ పైనా పలువురు క్రికెటర్ల అభ్యంతరాలు తెలిపారు. నాలుగు రోజుల టెస్టులో ఫలితాలు రావడం కష్టమని అన్ని డ్రాగా ముగుస్తాయని సిడిల్ తమ అభిప్రాయల్ని వెల్లడించాడు. అయితే తాజాగా మార్క వా కూడా మరో కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాడు.1991లో ఆస్ట్రేలియా క్రికెట్లో అడుగు పెట్టింది. 128 టెస్టులు ఆడిన మార్క్ వా 8వేల పరుగులు చేశాడు. 20 సెంచరీలు 47 అర్థ సెంచరీలు ఉన్నాయి. 244 వన్డేలు ఆడి 18 సెంచరీలు 50 అర్ధ శతకాలు సాధించాడు. 2002లో క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.  

Tags:    

Similar News