సినీనటితో మనీష్ పాండే వివాహం
టీమిండియా క్రికెటర్ మనీష్ పాండే వివాహం చేసుకున్నారు. ముంబైలోని ఓ హోటల్ వేదికగా సోమవారం కన్నడ నటి అశ్రిత శెట్టితో పాండే వివాహం జరిగింది.
టీమిండియా క్రికెటర్ మనీష్ పాండే వివాహం చేసుకున్నారు. ముంబైలోని ఓ హోటల్ వేదికగా సోమవారం కన్నడ నటి అశ్రిత శెట్టితో పాండే వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులతోపాటు సన్నిహితులు మాత్రమే హాజరైయ్యారు. సాంప్రదాయ పద్దతిలో అంగరంగవైభవంగా వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధింన ఓ ఫొటోను సన్‌రైజర్స్ హైదరాబాద్ తన ట్వీటర్ ఖాతాలొ పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా మనీష్ పాండే, అశ్రితకు శుభాకాంక్షలు తెలిపింది. ముంబైకి చెంది అశ్రిత శెట్టి తుళు భాషలోని పలు చిత్రాల్లో నటించింది. తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. హీరో సిద్ధార్థ్‌తో కలిసి నటించిన ఎన్‌హెచ్ 4 మూవీ తెలుగులో కూడా వచ్చింది.
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు జట్టకు మనీష్ పాండే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టీ20 ట్రోఫీని కర్ణాటక జట్టు గెలుచుకుంది. మనీష్ పాండే సారద్యంతోని జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫిని సొంతం చేసుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తమిళనాడు జట్టుపై కర్ణాటక జట్టు తలపడింది. ఒక పరుగు తేడాతో విజయం సాధించింది.
నిర్ణిత ఓవర్లలో కర్నాటక జట్టు 180/5 పరుగులు సాధించింది. 181 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు జట్టు చేజింగ్ లో తడపడింది. 179/6కు పరిమితమై ఒక్కపరుగు తేడాతో ఓటమి పాలైంది. గతేడాది టోర్నీ నెగ్గిన కర్ణాటక ఈసారి కూడా విజేతగా నిలవడం విశేషం. మనీశ్ పాండే ( 60పరుగులు, 45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించాడు.
Wishing good luck, happiness and lots of love to @im_manishpandey and Ashrita 🥰
— SunRisers Hyderabad (@SunRisers) December 2, 2019
Congratulations!! 🎉🎊#OrangeArmy #ManishPandey #SRHFamily pic.twitter.com/AjdlMOUPQ9