Pakistan opener Imran Nazir: ఆ బాధ‌ నా చివరి శ్వాస వరకూ ఉంటుంది: పాకిస్థాన్ ఓపెన‌ర్‌

Pakistan opener Imran Nazir: 2007 టీ 20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్, పాకిస్థాన్‌ల మ‌ధ్య ఉత్కంఠ పోరు సాగింది. ఈ పోరులో టీమిండియా సంచలన విజయం సాధించింది. టీ 20 ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది.

Update: 2020-09-16 16:36 GMT

Pakistan opener Imran Nazir: 2007 టీ 20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్, పాకిస్థాన్‌ల మ‌ధ్య ఉత్కంఠ పోరు సాగింది. ఈ పోరులో టీమిండియా సంచలన విజయం సాధించింది. టీ 20 ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్ లో భారత్ నిర్ణ‌యించిన‌ 158 పరుగుల లక్ష్యాన్ని చేధించ‌డంలో పాకిస్థాన్ త‌డ‌బ‌డింది. చివరి బంతికి మిస్బావుల్‌ హక్‌ను జోగేందర్‌ శర్మా అవుట్ చేయడంతో టీ 20 ప్రపంచకప్ భారత్‌ సొంతమైంది. ఐతే ఈ విషయంపై పాకిస్తాన్ ఓపెనర్ ఇమ్రాన్ నజీర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.

సులువుగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకున్నందుకు తీవ్ర మనోవేధనకు గురయినట్లు తెలిపారు. భారత్‌ చేతిలో పాక్‌ ఓటమిని జీర్ణించుకోలేనని, ఆ ఓట‌మి నా చివరి శ్వాస వరకూ నన్ను బాధిస్తూనే ఉంటుందన్నాడు. నిజానికి ఆ లక్ష్యాన్ని తాను ఛేధించగలననే నమ్మకంతో ఉన్నానని, కానీ అలా జరిగిపోయిందని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో నజీర్‌ ఓపెనర్‌గా దూకుడైన ఆటతో అదరగొట్టాడు. కేవలం 5.3 ఓవర్లలోనే 53పరుగులు సాధించి పాక్‌ మెరుగైన రన్‌రేటును సాధించింది. కేవలం 14బంతుల్లోనే వాయువేగంతో 33 పరుగులను నజీర్‌ సాధించాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న తాను రనౌట్‌ కావడం తీవ్ర నిరాశ కలిగించిందని నజీర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.   

Tags:    

Similar News