యూవీ రికార్డు సమం..6 బంతుల్లో 6 సిక్సర్లలు బాదిన న్యూజిలాండ్ క్రికెటర్

Update: 2020-01-05 11:38 GMT
Leo Carter

అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు సాధించిన ఘనత దక్షిణాఫ్రికా క్రికెటర్ గిబ్స్, యువరాజ్ మాత్రమే ఉన్నారు. అయితే దేశవాలీ క్రికెట్లో, ఇతర ఫార్మాట్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు సాధించిన వారిగా భారత మాజీ దిగ్గజ క్రికెటర్ రవిశాస్త్రి, వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ , హజ్రతుల్లా, రాస్ వైట్లీ, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు ఉన్నారు. యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్డ్ బ్రాడ్ బౌలింగ్ లో వరుస సిక్సులు సాధించాడు. గిబ్స్ 2007 వన్డే ప్రపంచ కప్ లో నెదర్లాండ్స్ పై ఈ ఘనత సాధించాడు.

అయితే తాజాగా ఈ లిస్టులోకి మరో ఆటగాడు చెరిపోయాడు. న్యూజిలాండ్ లియో కార్టర్‌ ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాది రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌ సూపర్‌ స్మాష్‌ టీ20 టోర్నీలో భాగంగా కాంటర్‌బరీ-నార్తరన్‌ నైట్స్‌ల జరిగిన మ్యాచ్ లియో కార్టర్‌ ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. కాంటర్‌బరీ జట్టు తరపున ఆడిన లియో కార్టర్‌ విశ్వరూపం చూపించాడు. ఈ మ్యాచ్‌లో లియో కార్టర్‌ ఇన్నింగ్స్‌ 16 ఓవర్‌లో ఆరు సిక్సులు కొట్టాడు. నార్తరన్‌ నైట్స్‌ జట్టు స్పిన్నర్‌ అంటోన్‌ డెవ్‌సిచ్‌ ఓవర్లో ఆరు సిక్సులతో విరుచుకుపడ్డాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 29 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 70 పరుగులు చేసి లియో కార్టర్‌ నాటౌట్ గా నిలిచాడు.

నార్తరన్‌ నైట్స్‌ నిర్ధేశించిన 219 పరుగుల లక్ష్యాన్ని కాంటర్‌బరీ 18.5 ఓవర్లలో చేధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన నార్తరన్ నైట్స్ ఏడు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. నార్తరన్ నైట్స్ 220 పరుగల లక్ష్యాన్నికాంటర్ బరీ మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. నార్తరన్ నైట్స్ బ్యాట్స్ మెన్ టిమ్ సిఫ్టెర్ట్ 36 బంతుల్లో 74 పరుగులు చేశాడు. లియో కార్టర్‌ (70) సిక్సర్లతో విజృంభించడంతో సునాయాసంగా విజయం సాధించింది. ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టిన క్రికెటర్లో లియో కార్టర్ ఏడో క్రికెటర్ కావడం విశేషం. 


 

Tags:    

Similar News