సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. బుధవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 28 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. రాబిన్ ఉతప్ప (50 బంతుల్లో 67 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), నితీశ్ రాణా (34 బంతుల్లో 63; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) మూడో వికెట్‌కు 66 బంతుల్లో 110 పరుగులు జోడించి భారీ స్కోరు సాధించారు...
అలాగే ఆండ్రీ రసెల్ (17 బంతుల్లో 48; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరిపించాడు. దీంతో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు. పంజాబ్ బౌలర్లు మహమ్మద్ సమీ , వరుణ్ చక్రవర్తి, హర్డ్స్ , టై తలో వికెట్ తీశారు. అనంతరం 219 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులు చేసి ఓటమి పాలైంది. పంజాబ్ ఆటగాళ్లలో డేవిడ్ మిల్లర్ (40 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మయాంక్ అగర్వాల్ (34 బంతుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేసినా జట్టు ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.