KKR vs SRH: ఫైనల్లో చిత్తుగా ఓడిన హైదరాబాద్.. మూడోసారి ఛాంపియన్‌గా కోల్‌కతా..

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad: ఐపీఎల్-2024 టైటిల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ఈ లీగ్‌లో కోల్‌కతా జట్టు మూడోసారి ఛాంపియన్‌గా నిలిచింది.

Update: 2024-05-26 17:48 GMT

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad: ఐపీఎల్-2024 టైటిల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ఈ లీగ్‌లో కోల్‌కతా జట్టు మూడోసారి ఛాంపియన్‌గా నిలిచింది. కేకేఆర్ జట్టు పదేళ్ల తర్వాత టైటిల్‌ను గెలుచుకుంది. చివరిసారి కోల్‌కతా 2014లో ఛాంపియన్‌గా నిలిచింది.

ఆదివారం చెపాక్‌ మైదానంలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ నిర్దేశించిన 114 పరుగుల లక్ష్యాన్ని 10.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఛేదించింది. వెంకటేష్ అయ్యర్ 26 బంతుల్లో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. రెహ్మానుల్లా గుర్బాజ్ 32 బంతుల్లో 39 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో ఆండ్రీ రస్సెల్ 3 వికెట్లు తీశాడు.

ఇరుజట్లు..

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

ఇంపాక్ట్ ప్లేయర్స్: అనుకుల్ రాయ్, మనీష్ పాండే, నితీష్ రాణా, KS భరత్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మర్క్రామ్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (కీపర్), షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కట్.

ఇంపాక్ట్ ప్లేయర్స్: ఉమ్రాన్ మాలిక్, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ మార్కండే, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్.

Tags:    

Similar News