భారీ విజయలక్ష్యాన్ని అందుకునే క్రమం లో నిలకడగా ఆడుతున్న కోహ్లీ, రోహిత్ జంటను ప్లంకెట్ విడదీశాడు. కోహ్లీ 66 పరుగులు చేసి ఔటయ్యాడు. నాలుగో నెంబరులో బ్యాటింగ్ కు దిగిన రిషబ్ పంత్ పై భారీ అంచనాలున్నాయి. ఇంకా ఇంగ్లాండ్ డే పైచేయిగా ఉన్న ప్రస్తుత తరుణంలో రోహిత్ క్రీజులో ఉండడమే భారత్ కు ఆశలు మిగిల్చింది. ప్రస్తుతం టీమిండియా 29 ఓవర్లలో 2 వికెట్లను 148 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 79 పరుగులతో వున్నాడు.