ఏ లెక్కన చూసినా 'కోహ్లీ'యే నెం 1 కెప్టెన్

Update: 2019-09-03 06:20 GMT

దూకుడు అంటే ఇది.. మహామహులు అనుకున్నవాళ్ళు చేరుకున్న లక్ష్యాల్ని వేగంగా ఇంకా చెప్పాలంటే సుడిగాలిలా చేరుకోవడం. ఆ విద్యలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీదే అగ్రస్థానం. కోహ్లీ దూకుడు ముందు చాలా రికార్డులు బద్దలు అవుతున్నాయి. కొన్ని స్మానమయిపోయి రేపో మాపో చరిత్రలో కలిసిపోనున్నాయి.

తాజాగా కూల్ కెప్టెన్.. టీమిండియాను ప్రపంచస్థాయిలో ఉత్తమ స్థానంలో నిలబెట్టిన మహేంద్రసింగ్ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. కోహ్లీ. అత్యధిక టెస్ట్ మ్యాచ్ విజయాలు సాధించిన కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు. అయితే, మామూలుగా అతను ఈ విజయాన్ని సాధించలేదు. అత్యంత వేగంగా.. ధోనీ నాయకత్వం వహించిన టెస్ట్ మ్యాచ్ లకంటె తక్కువ మ్యాచ్ లలోనే ఈ రికార్డు సాధించాడు కోహ్లీ. అందుకే ఏ లెక్కన చూసినా కోహ్లీ నెం 1 అంటున్నారు క్రికెట్ పండితులు.

మిస్టర్ కూల్ ధోనీ 60 టెస్ట్ మ్యాచ్ లలో భారత జట్టుకు సారధిగా వ్యవహరించాడు. అందులో 27 మ్యాచ్ లు గెలిపించాడు. ఇక 18 టెస్ట్ మ్యాచ్ లలో ఓటమి చవిచూసింది టీమిండియా. అదేవిధంగా 15 మ్యాచ్ లలో ఫలితం తేలలేదు. కాగా.. కోహ్లీ కేవలం 48మ్యాచులలోనే ధోనీ రికార్డు దాటేశాడు. మొత్తం 28 మ్యాచ్ లు కోహ్లీ సారధ్యంలో టీమిండియా గెలుచుకుంది. కాగా పది మ్యాచ్ లలోనే ఓటమి చెందిన భారత్ పదింటిని డ్రా చేసుకుంది. అంటే కోహ్లీ కెప్టెన్ గా విజయశాతం 58.33. అయితే, ధోనీ విజయాల శాతం 45 గా వుంది.

మరి కొన్నేళ్లు కెప్టెన్ గా కోహ్లీ ఖాయంగా ఉంటాడు. ఇప్పుడు టెస్ట్ వరల్డ్ సిరీస్ జరుగుతోంది. దీనిలో భారత్ ను నెంబర్ 1 గా కోహ్లీ కచ్చితంగా నిలబెడతాడని అభిమానులు నమ్ముతున్నారు.


Tags:    

Similar News