కాఫీ విత్ కరణ్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత యువక్రికెటర్లు హార్థిక్ పాండ్యా, కెఎల్ రాహుల్ ల పై విచారణ అనంతరం బీసీసీఐ చెరో 20 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని సామాజిక కార్యక్రమాలకు ఉపయోగించాలని ఆదేశించింది. విచారణ కోసం బీసీసీఐ పాలకమండలి నియమించిన ఆంబుడ్స్ మన్ డీకే జైన్ జరిమానా మొత్తాన్ని ఖరారు చేశారు. పుల్వామా అల్లర్లలో అమరులైన పారా మిలిటరీ జవాన్ల భార్యలలో పదిమందికి చెరో లక్ష రూపాయల చొప్పున ఇవ్వాలని భారత అంధుల క్రికెట్ సంఘానికి చెరో 10 లక్షలు ఇవ్వాలని ఆదేశించారు.