ధాటిగా బౌలింగ్ చేస్తున్న ప్లంకెట్‌ : కివీస్ కు ఇక్కట్లు

Update: 2019-07-14 12:33 GMT

వరల్డ్ కప్ ఫైనల్స్ లో కివీస్ బ్యాటింగ్ లో ఇబ్బందులు పడుతోంది. 35 ఓవర్లు ముగిసేసరికి కీలకమైన నాలుగు వికెట్లు చేజార్చుకుంది. స్థిరంగా ఆడుతున్న ఓపెనర్ హెన్రీ నికోల్స్‌ (55; 77 బంతుల్లో) అర్థ శతకం పూర్తి చేసుకున్న తరువాత ప్లంకెట్‌ వేసిన 26.5 బంతికి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ రూపంలో పెవిలియన్‌ చేరాడు. రాస్‌ టేలర్‌ (15; 31) మార్క్‌వుడ్‌ వేసిన 33.1వ బంతికి ఎల్బీగా వెనుతిరిగాడు. దీంతో నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది కివీస్. 35 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ జట్టు నాలుగు వికెట్లు నష్టపోయి 152 పరుగులు చేసింది. నీషమ్‌ (9) లేథమ్‌ (12) నిలకడగా ఆడుతున్నారు. 

Tags:    

Similar News