Kings Xi Punjab Co-Owner Ness Wadia on IPL 2020: ఆటగాళ్లకు రోజు కరోనా వైరస్ టెస్టులు చేయాలి: KXIP కో- ఓనర్
Kings Xi Punjab Co-Owner Ness Wadia on IPL 2020: కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలతో క్రీడా రంగంపై కూడా పడింది. దీంతో ఐసీసీ, బీసీసీ, ఇతర లీగ్ నిర్వహకులు అనేక మార్పులకు చేసి.. యూఏఈలో ఐపీఎల్ నిర్వహణకు సిద్ధమౌతున్నారు
Kings Xi Punjab Co-Owner Ness Wadia on IPL 2020: కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలతో క్రీడా రంగంపై కూడా పడింది. దీంతో ఐసీసీ, బీసీసీ, ఇతర లీగ్ నిర్వహకులు అనేక మార్పులకు చేసి.. యూఏఈలో ఐపీఎల్ నిర్వహణకు సిద్ధమౌతున్నారు. ఈ నేపథ్యంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (KXIP) సహ యజమాని నెస్ వాడియా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఐపీఎల్ సీజన్ సమయంలోప్రతిరోజూ క్రికెటర్లకి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాలని కింగ్స్ డిమాండ్ చేశాడు. ఐపీఎల్ సజావుగా జరిపేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉండాలని అన్నారు. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు పూర్తి స్థాయిలో షెడ్యూల్‌పై కసరత్తులు చేస్తోంది. 51 రోజుల విండోలో మొత్తం 60 మ్యాచ్‌లు జరగనుండగా.. డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఐదుగా ఉండే అవకాశం ఉంది.
కాగా, యూఏఈ లో జరిగే ఐపీఎల్‌కి తమ క్రికెటర్లని పంపేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులు ఇప్పటికే ప్రకటించాయి. ఇదే బాటలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక బోర్డులు అంగీకారం తెలిపే అవకాశం ఉంది. అలాగే ఐపీఎల్‌లో ఆడే క్రికెటర్లందరూ ఆగస్టు 20 నాటికి యూఏఈకి చేరుకోవాలని బీసీసీఐ ఆదేశించినట్టు సమాచారం. బీసీసీఐ త్వరలోనే ఐపీఎల్ కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ)ని తయారు చేయనుంది.
ఐపీఎల్ జరిగే సమయంలో కచ్చితమైన ఆరోగ్య పరిరక్షణ నిబంధనలు పాటించాలి. సాధ్యమైనంత ఎక్కువగా కరోనా పరీక్షలు జరపాలి. ఇంగ్లండ్‌లో జరుగుతున్న టెస్టు సిరీస్ తరహాలోనైతే బయో సెక్యూర్ వాతావరణం సాధ్యం కాదని, కోవిడ్–19 పరీక్షల విషయంలో యూఏఈ కూడా చాలా బాగా పని చేస్తోంది కాబట్టి బీసీసీఐ అక్కడి ప్రభుత్వానికి సహకరిస్తే చాలని నెస్ వాడియా వివరించారు. అలాగే ఐపీఎల్‌కు స్పాన్సర్లు రాకపోవచ్చనే వాదనను నెస్ వాడియా తిరస్కరించారు. గతంలో ఏ ఐపీఎల్‌కూ లభించని వీక్షకాదరణ టీవీల్లో ఈసారి లీగ్‌కు దక్కనుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో జనం మ్యాచ్‌ల కోసం ఎదురు చూస్తున్నారని నెస్ వాడియా అన్నారు.