సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి ఘోర పరాజయం పాలైంది. ఐపీఎల్‌లో భాగంగా కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆరు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. మొదట బ్యా టింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 150 పరుగులు చేసింది. వార్నర్ (62 బంతుల్లో 70 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. అశ్విన్, షమీ, ముజీబుర్ తలా ఒక వికెట్ తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 19.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసి గెలిచింది.
రాహుల్ (53 బంతుల్లో 71 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), మయాంక్ (43 బంతుల్లో 55; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. సందీప్ శర్మకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం 151 పరుగుల లక్ష్య చేధన కోసం బరిలోకి దిగిన పంజాబ్ జట్టు మరో బంతి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ బ్యాటింగ్‌లో రాహుల్(71) నాటౌట్ ,అగర్వాల్(55) అదరగొట్టేశారు.