న్యూజిలాండ్ జట్టుకు నా జీవితాంతం క్షమాపణ చెబుతా .. బెయిన్ స్టోక్స్

Update: 2019-07-15 04:48 GMT

ప్రపంచ కప్ లో అన్ని జట్లను దాటుకుంటూ అన్నింటికీ మించి సూపర్ ఓవర్ ని దాటుకుంటూ ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది . అయితే ఈ మ్యాచ్ లో అద్భుతమైన ఆటను కనబరిచినందుకు గాను ఇంగ్లాండ్ క్రికెటర్ బెయిన్ స్టోక్స్ కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది . అటు 50 ఓవర్ల మ్యాచ్ లోను ఇటు సూపర్ ఓవర్ లోను మంచి పరుగులు సాధించాడు స్టోక్స్ ..

అయితే న్యూజిలాండ్ జట్టు ఆటగాడు కెన్ విలియమ్సన్ కి జీవితాంతం క్షమాపణ చెబుతానని అన్నాడు .. మ్యాచ్ చివరి ఓవర్ లో ఆరు బంతులకు 15 పరుగులు అవసరం అన్న నేపధ్యంలో స్టోక్స్ రన్స్ తీస్తుండగా గప్తిల్ వికెట్ల పైకి విసిరిన బంతి స్టోక్స్ బ్యాట్ కి తగిలి అదనంగా నాలుగు పరగులు వచ్చాయి . అయితే అది కావాలని చేసింది కాదని స్టోక్స్ చెప్పుకొచ్చాడు . ఇలా జరగగానే విలియమ్సన్ దగ్గరికి వెళ్లి క్షమాపణలు చెప్పానని స్టోక్స్ వివరించాడు .. 



Tags:    

Similar News