Iranian wrestler Navid Afkari: ఇరాన్ ఛాంపియన్ రెజ్లింగ్ ఉరితీత
Iranian wrestler Navid Afkari: ఇరాన్ ఛాంపియన్ రెజ్లర్ నవీద్ అఫ్కారీకి ఆ దేశ ప్రభుత్వం మరణశిక్షను అమలు చేసింది. ఈ రోజు ఉదయం అఫ్కారీకి అధికారులు మరణశిక్షను విధించారు.
Iranian wrestler Navid Afkari: ఇరాన్ ఛాంపియన్ రెజ్లర్ నవీద్ అఫ్కారీకి ఆ దేశ ప్రభుత్వం మరణశిక్షను అమలు చేసింది. ఈ రోజు ఉదయం అఫ్కారీకి అధికారులు మరణశిక్షను విధించారు. 2018లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొని ఓ సెక్యూరిటీ గార్డును హత్య చేశాడని ఆరోపిస్తూ ఈ శిక్షను విధించింది. మరోవైపు, ఈ కేసు ప్రపంచ వ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తించింది. చేయని తప్పును ఒప్పుకునేలా అఫ్కారీని టార్చర్ కు గురి చేశారంటూ అతని కుటుంబసభ్యులు, సామాజిక కార్యకర్తలు ఆరోపించారు.
ఈ ఆరోపణలను అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పూర్తిగా ఖండించింది. అంతకుముందు నవీద్‌కు చెందిన ఓ ఆడియో టేపు బయటకు వచ్చింది. ''నాకు మరణశిక్షను అమలు చేస్తే మీకో విషయం తెలియాలనుకుంటున్నాను. స్వశక్తిపై పోరాటం చేయాలనుకుంటున్న వ్యక్తి ప్రాణాలు తీశారు'' అని ఉంది. నవీద్‌ను చివరి సారి చూసేందుకు అతని కుటుంబానికి కనీసం అవకాశం కూడా కల్పించలేదు. నవీద్‌కు మరణశిక్షను నిలిపివేయాలని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 85వేల మంది అథ్లెట్లు ఇరాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అతడిని అన్యాయంగా లక్ష్యంగా మార్చుకొన్నారని ది వరల్డ్ ప్లేయర్స్ అసోసియేషన్ పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా నవీద్‌కు క్షమాభిక్ష ఇవ్వాలని కోరారు. నవీద్‌పై చర్య విచారకరమని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ పేర్కొంది.