IPL2020: చెన్నై సూపర్ కింగ్స్ కి మరో షాక్
IPL2020: చెన్నై సూపర్‌కింగ్స్‌కు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పటికే అల్లాడిపోతున్న సీఎస్‌కే కి సురేష్ రైనా రూపంలో ఎదురుదెబ్బ తగలగా.. మరో బౌలర్ కి కరోనా పాజివిట్ అని తేలింది
IPL2020: చెన్నై సూపర్‌కింగ్స్‌కు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పటికే అల్లాడిపోతున్న సీఎస్‌కే కి సురేష్ రైనా రూపంలో ఎదురుదెబ్బ తగలగా.. మరో బౌలర్ కి కరోనా పాజివిట్ అని తేలింది. ముందుగా శుక్రవారం చెన్నై ఫాస్ట్ బౌలర్ ఒకరికి, ఇతర 11 మంది సభ్యులకు కరోనా వచ్చినట్టు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ నిర్ధారించింది. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ కి కరోనా పాజిటివ్ అని తెలుస్తోంది. శుక్రవారం చేసిన ఆర్‌టీ పీసీఆర్ పరీక్షల్లో అతడికి పాజిటివ్‌గా ధ్రువీకరణ అయినట్టు తెలుస్తోంది.
దీంతో ఈ టీంలో కొవిడ్-19 బాధితుల సంఖ్య మొత్తంగా 13కు చేరింది. ఒకే బృందంలో అంతమందికి వైరస్ సోకిందంటే పరిస్థితి కష్టమేనని అనిపిస్తోంది. పుణెకి చెందిన ఈ 23 ఏళ్ల రుతురాజ్ గైక్వాడ్.. మహారాష్ట్ర తరఫున 2018-19 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో రుతురాజ్‌ని ఐపీఎల్ 2019 ఆటగాళ్ల వేలంలో రూ. 20 లక్షలకి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. అప్పటి నుంచి టీమ్ తోనే అతను ఉన్నాడు. ఈ మధ్యే భారత్-ఏకు ఎంపికయ్యాడని, టాప్ ఆర్డర్‌లో ఆడతాడని, రంజీల్లో పరుగుల వరద పారించాడని సమాచారం. ఇక ఇటీవలే టీమ్‌తో కలిసి యూఏఈకి వెళ్లిన రైనా వ్యక్తిగత కారణాలతో ఇండియాకి తిరిగి రానున్నాడు.