వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ ఈ రోజుకి వాయిదా..

IPL 2023 Final CSK vs GT: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను వెంటాడుతున్న వరుణదేవుడు

Update: 2023-05-29 03:00 GMT

వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ ఈ రోజుకి వాయిదా..

IPL 2023 Final CSK vs GT: నిన్న జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఈరోజు రాత్రికి నిర్వహించనున్నారు. ఇండియా ప్రీమియర్ లీగ్ 2023 ఫైనల్ మ్యాచ్‌పై వరుణదేవుడు ప్రతాపం చూపించాడు. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వుడేగా ఉన్న ఈరోజు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

చెన్నై సూపర్‌కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య జరగాల్సిన ఐపీఎల్-16 సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. వర్షప్రభావంతో మ్యాచ్ నిర్వహణకు సాధ్య కాలేదు. నిన్న రాత్రి టాస్‌ పడకముందు నుంచే నరేంద్ర మోదీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎడతెరపిలేని వర్షంతో టాస్ టైమ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.

వర్షంతగ్గిన తర్వాత ఓవర్లను కుదించి ఆడిస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. క్రమేణ వరుణుడు కాస్త శాంతించినట్టు కనిపించాడు. అయితే మ్యాచ్‌ను నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా తిరిగి వర్షం మొదలైంది. తర్వాత వర్షం తగ్గకపోగా మరింత ఎక్కువైంది. దీంతో మ్యాచ్‌ నిర్వహణ సాధ్యం కాదని నిర్వాహకులు తేల్చారు. రిజర్వ్‌ డేగా ఉన్న ఈరోజు ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించాలని డిసైడయ్యారు.

ఈరోజు కూడా అహ్మదాబాద్‌లో వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు విచారం వ్యక్తం చేశారు. కనీసం 5 ఓవర్ల మ్యాచ్‌ అయినా నిర్వహిస్తే బాగుంటుందనే భావన వ్యక్తమవుతోంది. అదీ కూడా సాధ్యం కాకపోతే సూపర్‌ ఓవర్‌ ద్వారానైనా ఫైనల్ విజేతను ప్రకటించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. రిజర్వ్‌ డే రోజు కూడా మ్యాచ్‌ జరగకపోతే లీగ్‌ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును ఛాంపియన్‌గా ప్రకటించే అవకాశాలున్నాయి.

వర్షంకారణంలో ఈరోజు మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితి తలెత్తితే  ఐపీఎల్ 2023 సీజన్లో లీగ్ దశలో గుజరాత్ టైటాన్స్ అద్భుత ప్రదర్శన చేసింది. ప్రత్యర్థి జట్లను వణికించింది. అత్యధిక విజయాలను నమోదు చేసిన జట్టుగా ఎక్కువ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. లీగ్ దశలో 14 మ్యాచ్‌ల్లో 10 విజయాలు సాధించిన గుజరాత్ టైటాన్స్‌ 20 పాయింట్లతో ఉన్నందువల్ల ఛాంపియన్‌గా నిలుస్తుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేశారు.

Tags:    

Similar News