IPL 2023 Finals: ధోనీ, రోహిత్ సరసన హార్థిక్ పాండ్యా.. జీటీ కెప్టెన్ ను ఊరిస్తున్న అరుదైన రికార్డ్..!

IPL 2023 Finals: ఫైనల్ మ్యాచ్ లో ధోనీ సేనతో హార్థిక పాండ్యా టీమ్ అమీతుమీ తేల్చుకోనుంది.

Update: 2023-05-27 13:30 GMT

IPL 2023 Finals: ధోనీ, రోహిత్ సరసన హార్థిక్ పాండ్యా.. జీటీ కెప్టెన్ ను ఊరిస్తున్న అరుదైన రికార్డ్..!

IPL 2023 Finals: గత సీజన్ల కంటే ఎంతో రసవత్తరంగా సాగిన ఐపీఎల్ 16వ సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఈ సీజన్ విజేత ఎవరనేది ఆదివారం జరిగే తుది పోరుతో తేలిపోనుంది. ఫైనల్ మ్యాచ్ లో ధోనీ సేనతో హార్థిక పాండ్యా టీమ్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలోనే గుజరాత్ టైటాన్స్ కు నేతృత్వం వహిస్తున్న హార్థిక పాండ్యాను అరుదైన రికార్డ్ ఊరిస్తోంది.

అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా హార్థిక పాండ్యా కప్ అందుకోవడమే కాకుండా ధోనీ, రోహిత్ సరసన చేరతాడు. వరుసగా రెండు సీజన్లలో ఐపీఎల్ ఛాంపియన్ గా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు నిలిచాయి. ఎంఎస్. ధోనీ నేతృత్వంలోని సీఎస్కే జట్టు 2010, 2011 సీజన్లలో కప్ గెలుచుకుంటే 2019, 2020లో రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ వరుసగా రెండుసార్లు విజేతగా నిలిచింది.

గత ఏడాది గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచిన విషయం మనకు తెలిసిందే కదా..ఈ క్రమంలో ఆదివారం జరిగే ఫైనల్స్ లో సీఎస్కేను ఓడిస్తే వరుసగా రెండో ఏడాది కూడా కప్ గెలిచిన మూడో జట్టుగా గుజరాత్ టైటాన్స్ కు అరుదైన గౌరవం దక్కుతుంది. మరి, ధోనీ, రోహిత్ సరసన హార్థిక పాండ్యా నిలుస్తాడో లేదో చూడాలి.

ఇక మరో అరుదైన రికార్డ్ సైతం హార్థిక పాండ్యను ఊరిస్తోంది. ఆరంగేట్రం చేసి వరుసగా రెండేళ్లు కప్ అందుకున్న జట్టుగా గుజరాత్ టైటాన్స్ అరుదైన రికార్డ్ ను వశం చేసుకుంటుంది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన ఘనత...ఎందుకంటే, ఇప్పటివరకు ఏ టీమ్ కు అలాంటి రికార్డు లేదు..ఫైనల్స్ లో గెలిస్తే..గుజరాత్ టైటాన్స్ పేరుతో తొలిసారి రికార్డు నమోదు అవుతుంది. 

Tags:    

Similar News