IPL 2023 FINAL'S: చంద్రమండలంలోనూ ధోనీ ఫ్యాన్స్ ఉంటారు: ఇర్ఫాన్ పఠాన్

*ఐపీఎల్ 2023 ఫైనల్స్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ నెగ్గి టైటిల్ నిలబెట్టుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

Update: 2023-05-29 13:19 GMT

IPL 2023 FINAL'S: చంద్రమండలంలోనూ ధోనీ ఫ్యాన్స్ ఉంటారు: ఇర్ఫాన్ పఠాన్

IPL 2023: ఐపీఎల్ 2023 ఫైనల్స్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ నెగ్గి టైటిల్ నిలబెట్టుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మహేంద్ర సింగ్ ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్ అని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో టైటిల్ గెలిచి ఘనమైన వీడ్కోలు పలకాలని సీఎస్కే టీమ్ ఆరాటపడుతోంది. ఇలా రెండు జట్లు తమ బలాబలాలను ప్రదర్శించుకునేందుకు పోటీపడుతుండగా, అభిమానులు సైతం ఈ మ్యాచ్ కోసం ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.ఫైనల్ మ్యాచ్ నిజానికి ఆదివారం జరగాల్సి ఉంది. వరుణుడు అడ్డం పడడంతో రిజర్వ్ డేకు వాయిదా పడింది. ఈ రిజర్వ్ డే అయినా మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సస్పెన్స్ ఓ వైపు కొనసాగుతుండగానే మరోవైపు మ్యాచ్ చూసేందుకు లక్షలాదిమంది క్రికెట్ అభిమానులు నరేంద్రమోదీ స్టేడియంకు తరలివస్తున్నారు. ఈ మ్యాచ్ గుజరాత్ హోం టౌన్ లో జరుగుతున్నా...సీఎస్కే అభిమానులే ఎక్కువగా స్టేడియం వద్దకు చేరడం విశేషం..

ధోనీ ఫ్యాన్ బేస్ గురించి టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సీఎస్కేను ప్రతి జట్టూ అభిమానిస్తుందని...సూపర్ స్టార్ రజనీ కాంత్ ను చెన్నై వాసులు ఎంతగా అభిమానిస్తారో అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా సీఎస్కే సారథి మహేంద్ర సింగ్ ధోనీని సైతం అభిమానిస్తారని ఇర్ఫాన్ చెప్పుకొచ్చారు. అంతేకాదు, చంద్రమండలంలోకి వెళ్లినా సీఎస్కే అభిమానులుంటారని వ్యాఖ్యానించాడు. ధోనీ గురించి, సీఎస్కే పట్ల చెన్నై వాసుల అభిమానం గురించి ఇర్ఫాన్ పఠాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యల్లో ఏమాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి. ఎందుకంటే, ఇతర మ్యాచుల్లో సైతం సీఎస్కే జెండాలు రెపరెపలాడడం ఈ ఐపీఎల్ లో మనం చూశాం.

Full View


Tags:    

Similar News