IPL 2021: ఐపీఎల్‌ కోసం బీసీసీఐ కొత్త రూల్స్

IPL 2021: ఐపీఎల్‌ ను విజయవంతం చేయడానికి బీసీసీఐ మరింతగా పకడ్బందీ రూల్స్ ను ఏర్పాటు చేస్తోంది.

Update: 2021-08-10 16:00 GMT

IPL 2021: ఐపీఎల్‌ కోసం బీసీసీఐ కొత్త రూల్స్

IPL 2021: ఐపీఎల్‌ ను విజయవంతం చేయడానికి బీసీసీఐ మరింతగా పకడ్బందీ రూల్స్ ను ఏర్పాటు చేస్తోంది. ఈసారి లీగ్ నిర్వహణలో ఎలాంటి వైరస్ భయాలు లేకుండా చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగానే UAE లో ఈసారి 14 బయో బబుల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. క్రికెటర్లు సిక్స్ బాదితే బాల్ మైదానం దాటి బయట పడితే ఇక ఆ బాల్ ను వాడరాదని నిర్ణయించారు.

దానికి బదులుగా అంపైర్ నుంచి ఆటగాళ్లు కొత్త బాల్ తీసుకోవచ్చు బాల్ ద్వారా కరోనా వచ్చే ఛాన్స్ లేకపోయినా ఎలాంటి రిస్క్ తీసుకోకూడదన్న నిర్ణయంతోనే బీసీసీఐ కొత్త రూల్స్ ఫ్రేమ్ చేస్తోంది. ప్రతీ బాల్ ను ఆల్క హాల్ తో శుభ్రం చేశాక బాల్స్ లైబ్రరీలో పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే క్రికెటర్లు గ్రౌండ్ లో ఉమ్మకుండా రూల్స్ మార్చారు. వారికి టిష్యూ పేపర్లను ఇచ్చి వారే నేరుగా చెత్తకుండీలో వేసేలా జాగ్రత్తలు తీసుకుంటారు. 

Tags:    

Similar News