KKR vs CSK Match Preview: వరుస విజయాలతో చెన్నై... వరుస ఓటములతో కేకేఆర్

KKR vs CSK Match Preview: నేడు రెండో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి.

Update: 2021-04-21 12:32 GMT
చెన్నైసూపర్ కింగ్స్‌ తో తలపడనున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (ఫొటో ట్విట్టర్)

KKR vs CSK Match Preview: ఐపీఎల్ 2021 లో భాగంగా నేడు రెండో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకి ఈ మ్యాచ్ జరగబోతోంది.

ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, మంచి ఊపులో ఉంది. అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్‌తోనూ ధోనీ సేన అదరగొట్టేసింది. ఈ రెండు విజయాలతో మెరుగైన నెట్ రన్‌రేట్‌‌ని చెన్నై సొంతం చేసుకుంది.

మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫస్ట్ మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచినా.. ఆ తర్వాత వరుసగా ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి, తిరిగి ఫాంలోకి రావాలని ఆరాటపడుతోంది.

ముఖాముఖీ పోరాటాల్లో చెన్నై టీమ్‌దే ఆధిపత్యం. ఇప్పటి వరకు 23 మ్యాచ్‌ల్లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఇందులో ఏకంగా 14 మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఇక మిగిలిన 9 మ్యాచ్‌లకిగానూ 8 మ్యాచ్‌ల్లో కోల్‌కతా గెలుపొందింది. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు.

కోల్‌కతా ఓపెనర్లు నితీశ్ రాణా, శుభమన్ గిల్ బాగానే ఆడుతున్నారు. కానీ, మెరుగైన పార్టనర్ షిప్ అందించలేక విఫలమవుతున్నారు. ఇక కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్, ఆండ్రీ రసెల్ ఇప్పటి వరకూ తమ బ్యాట్ ను ఝులిపించలేదు. రాహుల్ త్రిపాఠి ఫర్వాలేదనిపించినా... ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు.

కోల్‌కతా బౌలింగ్‌ కూడా ఫేలవంగా తయారైంది. పాట్ కమిన్స్, హర్భజన్ సింగ్, షకీబ్ అల్ హసన్, ఆండ్రీ రసెల్, వరుణ్ చక్రవర్తి, ప్రసీద్‌ లు గెలిపించే ప్రదర్శన ఇప్పటి వరకు చేయలేదు. అందరూ ధారాళంగా పరుగులిచ్చేస్తున్నారు. దీంతో షకీబ్ స్థానంలో సునీల్ నరైన్‌ని తుది జట్టులోకి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో నిలకడగా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కానీ, మెరుగైన స్కోర్లు మాత్రం చేయడంతో... పెద్దగా బ్యాట్స్‌మెన్స్ వైఫల్యం కనిపించడం లేదు. మొయిన్ అలీ, ఓపెనర్ డుప్లెసిస్, సురేశ్ రైనా, అంబటి రాయుడు లు మ్యాచ్ కి అనుగుణంగా హిట్టింగ్ చేస్తున్నారు. ఇక లోయర్ ఆర్డర్‌లో రవీంద్ర జడేజా, శామ్ కరన్, డ్వేన్ బ్రావో తమ పాత్రను చక్కగా నిర్వర్తిస్తున్నారు.

ఇక బౌలింగ్‌లో ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్, శామ్ కరన్ చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. రవీంద్ర జడేజా, మొయిన్ అలీ పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్నారు. డ్వేన్ బ్రావో కూడా ఆకట్టుకుంటున్నాడు.

మీకు తెలుసా?

- కేకేఆర్ వాంఖడేలో పేలవమైన రికార్డును కలిగి ఉంది. ఈ వేదికలో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఎనిమిదింట్లో ఓడిపోయారు.

- నరైన్ బౌలింగ్‌లో చెన్నై కెప్టెన్ ధోని ఐపీఎల్ లో ఇంతవరకు ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు.

- దినేష్ కార్తీక్ ఐపీఎల్ లో తన 200వ మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు.

- ఐపీఎల్‌లో వికెట్ తీయడానికి హర్భజన్ సింగ్ కు 712 రోజులు వేచి ఉండాల్సి వచ్చింది. ఈ వ్యవధిలో, అతను కేవలం 5 మ్యాచ్‌ల్లోనే పాల్గొన్నాడు. 2020 సీజన్ లో అసలు ఆడలేదు.

ప్లేయింగ్ లెవన్ (అంచనా)

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబతి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్ అండ్ కీపర్), సామ్ కుర్రాన్, శార్దుల్ ఠాకూర్, డ్వేన్ బ్రావో / లుంగి ఎన్గిడి, దీపక్ చాహర్.

కోల్‌కతా నైట్‌రైడర్స్: నితీష్ రానా, శుబ్మాన్ గిల్, రాహుల్ త్రిపాఠి, ఎయోన్ మోర్గాన్ (కెప్టెన్), షకీబ్ అల్ హసన్ / సునీల్ నరైన్, దినేష్ కార్తీక్ (కీపర్), ఆండ్రీ రస్సెల్, పాట్ కమ్మిన్స్, హర్భజన్ సింగ్, ప్రసిద్ కృష్ణ / కమలేష్ నాగర్‌కోటి / శివం చక్రావ్.

Tags:    

Similar News