IPL 2021 KKR vs CSK: : హాఫ్ సెంచరీలతో రాణించిన చెన్నై ఓపెనర్లు; కోల్‌కతా ముందు 221 పరుగుల భారీ లక్ష్యం

IPL 2021 KKR vs CSK: : నేడు రెండో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతున్నాయి.

Update: 2021-04-21 15:55 GMT
చెన్నై ఓపెనర్లు (ఫొటో ట్విట్టర్)

IPL 2021 KKR vs CSK: ఐపీఎల్ 2021 లో భాగంగా నేడు రెండో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మేరకు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై టీం ఓపెనర్లు రాణించడంతో 20 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 220 పరుగులు భారీ స్కోరు సాధించింది.

టాస్ గెలిచామనే ఆనందం కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం కు లేకుండా చేశారు చెన్నై టీం ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(64 పరుగులు, 42 బంతులు, 6ఫోర్లు, 4సిక్సులు), ఫాఫ్ డు ప్లెసిస్(95పరుగులు, 60 బంతులు, 9ఫోర్లు, 4 సిక్సులు, నాటౌట్). కోల్‌కతా బౌలర్లను ఓ ఆటఆడుకున్నారు. వికెట్ల కోసం బౌలర్లు చేయని ప్రయోగాలు లేవు. చెన్నై ఓపెనర్ల బ్యాటింగ్ ముందు కోల్‌కతా బౌలర్లు తేలిపోయింది.

మొదటి వికెటే తీసేందుకు కోల్‌కతా బౌలర్లు 12 ఓవర్లు పోరాడాల్సి వచ్చింది. వరుణ్‌ చక్రవర్తి వేసిన 12.2వ ఓవర్‌కు రుతురాజ్‌ గైక్వాడ్‌ ఔటయ్యాడు. కమిన్స్‌ క్యాచ్‌ అందుకోవడంతో చెన్నై 115 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది.

అనంతరం బ్యాటింగ్ వచ్చిన మెయిన్ అలీ(25 పరుగులు, 12 బంతులు, 2ఫోర్లు, 2సిక్సులు) కూడా కోల్‌కతా బౌలర్లపై విరుచపడ్డాడు. 165 పరుగుల వద్ద సునీల్ నరైన్ బౌలింగ్ పెవిలియన్ చేరాడు మెయిన్అలీ. 17వ ఓవర్లో తొలి రెండు బంతులను ఫోర్‌, సిక్సర్‌గా మలిచిన అతడు మూడో బంతికి స్టంపౌటయ్యాడు.

ఆ తరువాత బ్యాటింగ్ వచ్చిన ధోనీ(17పరుగులు, 8బంతులు, 2ఫోర్లు, 1సిక్స్) కూడా తన బ్యాట్ కు పదును పెట్టాడు. మంచి ఊపుమీద ఉన్న ధోనీని రస్సెల్ బోల్తా కొట్టించాడు. 18.6 ఓవర్లో మోర్గాన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు ధోనీ.

కోల్‌కతా బౌలర్లలో చక్రవర్తి, నరేన్, రస్సెల్ తలో వికెట్ తీశారు.


Tags:    

Similar News