CSK vs DC: గెలిచిన జట్టే నెంబర్ వన్.. నేడు చెన్నైతో ఢిల్లీ "ఢీ"
* నేడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడనున్న ఢిల్లీ క్యాపిటల్స్
CSK vs DC: ఐపీఎల్ 2021 లో ఘన విజయాలతో పాయింట్స్ పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య సోమవారం జరగనున్న హోరాహోరి పోరుకు దుబాయ్ క్రికెట్ స్టేడియం సిద్దమైంది. పాయింట్స్ టేబుల్ లో టాప్ -2 లో నిలువాలంటే కచ్చితంగా ఇరు జట్లకు ఈ రోజు మ్యాచ్ గెలుపు కీలకంగా మారనుంది. ఇప్పటికే వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న బెంగుళూరు జట్టు 16 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
ఇక త్వరలో జరగనున్న చివరి రెండు మ్యాచ్ లలో కనుక బెంగుళూరు జట్టు ఘనవిజయం సాధిస్తే టాప్ 2 లోకి వెళ్ళే అవకాశాలున్నా.. బెంగుళూరు టీం టాప్ 2 కి చేరాలంటే ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై విజయాలపై ఆదారపడి ఉంది. సూపర్ సెంచరీతో మంచి ఫామ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఆరంజ్ క్యాప్ రేసులో కెఎల్ రాహుల్ తరువాత రెండో స్థానంలో నిలిచాడు. మరోపక్క ఢిల్లీ ఆటగాడు శిఖర్ ధావన్ కి చెన్నై జట్టుపై చివరి రెండు మ్యాచ్ లలో మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా పొందిన రికార్డు ఉంది.
అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓపెనర్ పృథ్వీ షాని దీపక్ చాహర్ తన బౌలింగ్ లో 50 బంతుల్లో 5 సార్లు అవుట్ చేసిన రికార్డు ఉంది. ఈరోజు ఈ రెండు టీమ్స్ మధ్య జరగనున్న మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు సాగుతుందనడంలో అభిమానులకు ఎలాంటి సందేహం లేదు. పిచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ని ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తుది జట్టు వివరాలు ఇలా..
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్టీవ్ స్మిత్, శ్రేయాన్స్ అయ్యర్, రిషబ్ పంత్, షిమ్రాన్ హెట్మేయర్, అక్షర్ పటేల్, అశ్విన్, కాగీస్ రబాడ, అన్రిచ్ నార్తాజ్, అవేశ్ ఖాన్
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, హాజెల్‌వుడ్, సామ్ కర్రాన్, దీపక్ చాహర్