IPL 2021 Auction: మళ్లీ జాక్‌ పాట్‌ కొట్టి ఆసీస్ క్రికెటర్

ఈ వేలంలో బీసీసీఐ కార్యదర్శి జే షా, ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా, కోశాధికారి అరుణ్ ధుమాల్‌ పాల్గొన్నారు.

Update: 2021-02-18 10:50 GMT

 Glenn Maxwell

ఐపీఎల్ సీజన్ 14 మీని వేలం మొదలైంది. ఈ వేలంలో బీసీసీఐ కార్యదర్శి జే షా, ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా, కోశాధికారి అరుణ్ ధుమాల్‌ పాల్గొన్నారు. కర్ణాటక ఆటగాడు కరుణ్‌ నాయర్‌ తొలుత ప్రటిచారు. అతడిని రూ.50 లక్షల కనీస ధరకూ కొలుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి కనబర్చలేదు. దక్షిణాఫ్రికా పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌మోరిస్‌ కోసం ముబయి, బెంగళూరు పోటీ పడుతున్నాయి.

ఆసీస్ బ్యాట్స్ మెన్ మాజీ సారథి స్టీవ్‌స్మిత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది. రూ.2 కోట్లకు ఆర్‌సీబీ బిడ్‌ను వేయగా ఢిల్లీ మరో 20 లక్షలు పెంచి 2కోట్ల 20 లక్షల రూపాయలకు దక్కించుకొంది. ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ కు మొండిచేయి చూపాయి. భారత జట్టు కీలక ఆటగాడు హనుమ విహారిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. విధ్వంసక ఆటగాడు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ కోసం ఆర్‌సీబీ, చెన్నై సూపర్‌కింగ్స్‌ పోటీ పడ్డాయి. చివరికి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అతడిని రూ.14.25 కోట్లకు కొనుగోలు చేసింది. 

Tags:    

Similar News