IPL 2020: అద్భుతమైన బౌలింగ్.. కుంబ్లే సరసన చేరిన బెంగళూరు స్పిన్నర్
IPL 2020: ఐపీఎల్ 2020లో భాగంగా సోమవారం రాత్రి ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉత్కంఠభరితమైన పోరు జరిగింది
IPL 2020: ఐపీఎల్ 2020లో భాగంగా సోమవారం రాత్రి ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉత్కంఠభరితమైన పోరు జరిగింది. ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో.. ఆ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. ఇందులో బెంగళూరు 'సూపర్ విక్టరీని అందుకుంది.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ' డివిలియర్స్ (24 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఫించ్ (35 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్), దేవ్‌దత్ పడిక్కల్ (40 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించారు. తర్వాత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి సరిగ్గా 201 పరుగులు చేయడంతో మ్యాచ్ 'టై' అయ్యింది. విజేత కోసం సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది.
ఈ మ్యాచ్‌లో ఇరు జట్టు భారీగా పరుగుల సునామీని సృష్టించాయి. ఒక్కో జట్టు 200పైగా పరుగులు చేశాయి. అంటే 40 ఓవర్లల్లో 400 పైగా పరుగులు. స్ట్రైక్ రేట్ దాదాపు 10 కి పైగానే. కానీ ఈ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. సుందర్ తాను వేసిన నాలుగు ఓవర్లలో ఒక వికెట్ తీసుకోని, కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ ఆయన ఎకానమీ రేటు కేవలం 3.00గా నమోదైంది. ఈ ప్రదర్శనతో సుందర్ సరికొత్త రిక్డాడు నెలకోల్పాడు.
ఎకానమీ రేటు పరంగా టీమిండియా మాజీ కెప్టెన్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే సరసన చేరాడు. 2009లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్పిన్నర్‌గా జంబో రెండు వికెట్లు తీసి.. 12 పరుగులు ఇచ్చాడు. ఫలింతగా ఎకానమీ రేటు 3.00గా నమోదైంది. ఇప్పుడు అదే ఎకానమీ గణాంకాలను సుందర్ నమోదు చేశాడు. దాంతో కుంబ్లే సరసన సుందర్ నిలిచాడు.