IPL 2020: ఢిల్లీ క్యాపిటల్స్‌ను పంజాబ్ కింగ్స్ పడగొట్టేనా?!
IPL 2020: ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లు తలపడనున్నాయి. ఈ రసవత్తరమైన పోరుకు దుబాయ్ వేదికగా కానున్నది.
IPL 2020: ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లు తలపడనున్నాయి. ఈ రసవత్తరమైన పోరుకు దుబాయ్ వేదికగా కానున్నది. ఇప్పటిదాకా టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన..ఏడు మ్యాచుల్లో విజయం సాధించింది. ఈ విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఇదిలాఉంటే.. కింగ్స్ లెవన్ పంజాబ్ కు మాత్రం ఇది డూ ఆర్ డై మ్యాచ్. ఇప్పటివరకు పంజాబ్ జట్టు మూడు విజయాలు మాత్రమే నమోదు చేసుకుంది. ఈ జట్టు లీగ్‌లో ఆడే ప్రతీ మ్యాచ్ గెలిచి తీరాలి. మంచి ఫామ్ లో ఉన్న ఢిల్లీ ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే-ఆఫ్స్‌కు వెళ్లాలని భావిస్తోంది.
ఢిల్లీ క్యాపిటల్స్ ఆటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌కి పవర్ హిట్టర్ సిమ్రాన్ హిట్‌మెయర్, వికెట్ కీపర్/ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ మళ్లీ ఈరోజు మ్యాచ్‌తో టీమ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. తొడ కండరాల గాయం కారణంగా గత వారం రోజులుగా ఐపీఎల్ మ్యాచ్‌లకి రిషబ్ పంత్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఓపెనర్ ధావన్, పృథ్వీ షా, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, స్టోయినిస్, అక్షర్ పటేల్‌లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండగా.. అటు బౌలింగ్‌లో రబడా, నోర్తజే ,అశ్విన్‌లు అదరగొడుతున్నారు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విషయానికి వస్తే.. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ రాకతో ఈ జట్టు బ్యాటింగ్ లైనప్ మరింతగా బలంగా మారింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, గేల్, పూరన్, దీపక్ హూడాలు బ్యాట్ ఝుళిపిస్తుండగా.. బౌలింగ్‌లో షమీ, అర్షదీప్ సింగ్, కాట్రేల్, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్‌లు వికెట్లు పడగొడుతున్నారు. ఖచ్చితంగా ఇవాళ జరగబోయే మ్యాచ్ ఇరు జట్లకు కీలకమేనని చెప్పాలి.