రోహిత్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ పూర్తి జట్టిదే
గురువారం ఐపీఎల్ వేలం ముగిసింది. ఈ వేలంలో 8 ప్రాంఛైజీలు 62 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.
గురువారం ఐపీఎల్ వేలం ముగిసింది. ఈ వేలంలో 8 ప్రాంఛైజీలు 62 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వారిలో 29మంది విదేశీలు ఉన్నారు. అయితే నాలుగు సార్లు టైటిల్ సొంతం చేసుకున్న ముంబయి తమ దగ్గర ఉన్నప్పట్టికి ముంబై ఇండియన్స్ వచ్చే సీజన్-2020 కోసం గట్టి ప్రణాళికతో క్రికెటర్లను గొనుగోలు చేసింది. అయితే ముంబై ఇండియన్స్ అత్యధిక ధర చెల్లించి కొనుగోలు చేసిన క్రికెటర్ నాథన్ కౌల్టర్ నైల్ రూ. 8 కోట్లుకు దక్కించుకుంది.
వేలంలో ఢిపెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఆరుగురు ఆటగాళ్లను కోనుగోలు చేసింది. కౌల్టర్ నైల్ రూ.8 కోట్లు పెట్టగా.. క్రిస్ లిన్ 2 కోట్లుతో వెచ్చించింది. ముఖ్యంగా జట్టుకు సమర్థులైనా ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడంతో ముంబై ముందుంది. గురువారం జరిగిన వేలంలో 8 జట్లు మొత్తం రూ. 140.3 కోట్లు పెట్టి ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.
రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై క్రిస్ లిన్‌ను కనీసధర రూ. 2 కోట్లకు దక్కించుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఆటగాడు 2019 ఐపీఎల్ సీజన్లలో కోల్‌కతా తరపున బరిలోకి దిగాడు. యువ ఆటగాళ్లు సౌరభ్ తివారీ రూ.50 లక్షలు, దిగ్విజయ్ దేశ్‌ముఖ్, ప్రిన్స్ బల్వంత్‌రాయ్, మోహ్‌సిన్ ఖాన్ లను తలా రూ. 20 లక్షలు లకు ముంబై దక్కించుకుంది. వేలానికి ముందు ముంబై దగ్గర ఉన్న నగదు మొత్తం రూ. 13.05 కోట్లు మాత్రమే. అయితే 2020 సీజన్ కోసం వేలంలో అత్యల్ప నగదు కలిగిన ప్రాంఛైజీ ముంబై ఇండియన్స్ ఒక్కటే. వేలంలో ఆరుగురు ఆటగాళ్ల కోసం ముంబై ఇండియన్స్ రూ.11.2 కోట్లు వెచ్చించింది.
వేలం తర్వాత పూర్తి ఆటగాళ్ల జాబితా చూస్తే..
రోహిత్ శర్మ (కెప్టెన్), కీరోన్ పొలార్డ్, నాథన్ కౌల్టర్-నైలు, క్రిస్ లిన్, ట్రెంట్ బౌల్ట్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్,హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ, మిచెల్ మెక్‌క్లెనాగన్, క్వింటన్ డి కాక్, క్రునాల్ పాండ్యా, దిగ్విజయ్ దేశ్ముఖ్, సౌరభ్ తివారీ, రాహుల్ చాహర్, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, అన్మోల్‌ప్రీత్ సింగ్, జయంత్ యాదవ్, అనుకుల్ రాయ్, మొహ్సిన్ ఖాన్, ప్రిన్స్ బల్వంత్ రాయ్ సింగ్, ధావల్ కులకర్ణి.
వేలానికి కీలక ఆటగాళ్లు ముంబై విడుదల చేసింది. యువరాజ్ సింగ్, ఎవిన్ లూయిస్, తో సహా మరి కొందరిని ముంబై విడుల చేసింది. ఆడమ్ మిల్నే, జాసన్ బెహ్రెండోర్ఫ్,రసిఖ్ సలాం, పంకజ్ జస్వాల్, అల్జారీ జోసెఫ్, బరీందర్ స్రాన్, బ్యూరాన్ హెన్డ్రిక్స్, లాంటి ఆటగాళ్లను ముంబై విడుదల చేసింది.