IPL 2020: ఈ సారి ఆరెంజ్ క్యాప్ ఎవ‌రి సొంత‌మో?

IPL 2020: క‌రోనా భయంతో అల్లాడుతున్న జ‌నానికి ఐపీఎల్ రూపంలో కాస్త వినోదం దొర‌క‌నున్న‌ది. ఎన్నో ఆటంకాల త‌రువాత‌.. ఎట్ట‌కేల‌కు బీసీసీఐ ఐపీఎల్ కు షెడ్యూల్ ఖ‌రారు చేసింది

Update: 2020-09-11 07:55 GMT

orange cap,

IPL2020 : క‌రోనా భయంతో  అల్లాడుతున్న జ‌నానికి ఐపీఎల్ రూపంలో కాస్త వినోదం దొర‌క‌నున్న‌ది. ఎన్నో ఆటంకాల త‌రువాత‌.. ఎట్ట‌కేల‌కు బీసీసీఐ ఐపీఎల్ కు షెడ్యూల్ ఖ‌రారు చేసింది. వారంలోగా ఐపీఎల్ ప్రారంభం కానున్న‌ది. ఐపీఎల్ అంటేనే .. ఫోర్లు, సిక్సులతోపాటు భారీ భారీ హిట్టింగులు  క‌నిపిస్తాయి. బ్యాట్స్‌మెన్స్ , బౌల‌ర్ల మ‌ధ్య అధిప‌త్యం పోరు సాగుతుంది.ఈ  భీక‌ర‌పోరు గెలిచేది ఎవ‌రో ? ఈ ఏడాది ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకునేది ఎవ‌రో?

క్రికెట్‌లో ఎన్ని ఫార్మ‌ట్లు ఉన్నా.. ఐపీఎల్‌కు ఉన్న క్రేజే వేరు. అందుకే ఎన్ని అడ్డంకులు వచ్చిన బీసీసీఐ వెన‌క్కి త‌గ్గ‌లేదు. దుబాయి వేదిక‌గా నిర్వ‌హించ‌నున్న‌ది. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుద‌ల చేసింది. ఇప్ప‌టికే అన్ని జ‌ట్టు దుబాయి చేసుకుని ప్రాక్టీస్ మొద‌లు పెట్టాయి. దీంతో ఎక్క‌డ చూసి ఐపీఎల్ సంద‌డే క‌నిపిస్తుంది. ఇక ఐపీఎల్ అంటే ముందుగా అంద‌రికీ గుర్తుకు వ‌చ్చేది బ్యాట్స్ మెన్ భారీ షాట్స్‌. ప్రతి సీజ‌న్ల‌లోనూ..బౌల‌ర్ల‌పై బ్యాట్స్‌మెన్ అధిప‌త్యం కొన‌సాగుతునే ఉంది. ప్ర‌తి సీజ‌న్ల‌లోనూ ఎక్కువ ప‌రుగులు చేసి, రికార్డులు నెల‌కొల్పిన బ్యాట్స్ మెన్స్ ఎంద‌రో ఉన్నారు. అలాగే ఎక్కువ ప‌రుగులు చేసే వారి ఆరెంజ్ క్యాప్‌ను ఇవ్వ‌డం కూడా అనవాయితీగా కొన‌సాగుతునే వ‌స్తుంది. ఈ క్యాప్‌కు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు.

ప్రతి యేటా..ఈ క్యాప్‌ను సొంతం చేసుకోవడానికి చాలా మంది ఆటగాళ్లు ప‌రిత‌పిస్తారు.. ఈ సారి కూడా భారీ హిట్టింగ్‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించ‌డానికి ఆట‌గాళ్లు సంసిద్దంగా ఉన్నారు. టైటిల్ సాధించ‌డానికి ప‌రిత‌పిస్తున్న టీంలో రాయ‌ల్ చాలెంజ్స్ బెంగుళూర్ ఒక‌టి.. ఆ జ‌ట్టు కెప్టెన్ కోహ్లీ ఆట‌తీరు అంద‌రికీ తెలుసు. గ‌త మూడేండ్లుగా ఆర్సీబీ పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రగా నిలిచినా .. కెప్టెన్ కోహ్లీ మాత్రం వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న‌తో మెప్పిస్తునే ఉన్నారు. ఆయ‌న బెంగుళూర్ టీం కెప్టెన్‌గానూ.. బ్యాట్స్‌మెన్ గానూ అద్భుత‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శిస్తున్నారు. కోహ్లీ కూడా ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నార‌నే చె్ప్పాలి.

ఈ రేసులో ఉన్న మరొక్కరు ఆస్ట్రేలియ బ్యాట్స్‌‌మెన్ డేవిడ్ వార్న‌ర్‌. తెలుగు జ‌ట్టు స‌న్ రైజ‌ర్స్‌లో దుమ్ము లేపే ఆట‌గాడు. గ‌త సీజ‌న్‌లో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నారు. ఈ సారి కూడా త‌న దైన ఆట‌తీరుతో జ‌ట్టును విజ‌య తీరాల్లో నిల‌బెడుతార‌ని అంద‌రూ ఆకాంక్షిస్తున్నారు.

అలాగే .. ఈ రేసులో మ‌రో భీక‌ర ఆట‌గాడు బరిలో ఉన్నాడ‌నే చెప్పాలి.. అత‌డే రోహిత్‌ శ‌ర్మ‌. ముంబాయి ఇండియ‌న్స్ త‌రుపున ఆడే ఈయన భారీ హిట్టింగుల‌కు కేరాఫ్‌గా మారాడు. ఇప్ప‌టికే దుబాయికి చేరుకుని త‌న బ్యాటింగ్‌ను ప‌దును పెడుతున్నాడు. ఇటీవ‌ల ప్రాక్టీస్ మ్యాచ్ లో రోహిత్ బాదిన ఓ షాట్ వైర‌ల్‌గా మారింది. దీంతో రానున్న మ్యాచ్ ల‌లో త‌న విధ్వంసం  ఏవిధంగా ఉంటుందో చెప్ప‌క‌నే చేప్పాడు. అలాగే ఇంగ్లాండు బ్యాట్స్ మెన్ జోస్ బ‌ట్ల‌ర్ కూడా ఈ రేసులో ఉన్నాడ‌నే చెప్పాలి. ఆరెంజ్ క్యాప్‌పై క‌న్నేశాడు. ఇప్ప‌టికే అనేక మ్యాచ్ ల‌లో త‌న ఆట‌తీరుతో ఆక‌ట్టుకున్నారు.

కింగ్స్ ఎవెన్ పంజాబ్ ఆట‌గాడు కే ఎల్ రాహుల్ కూడా ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. గ‌త సీజ‌న్‌లో చివ‌రి వ‌ర‌కూ ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచారు. చివ‌రికి వార్న‌ర్ గెలుచుకున్నారు. ఆయ‌న త‌న ఆట‌తీరులో అంద‌రినీ ఆక‌ట్టు కున్నారు. జ‌ట్టులో ఏ స్థానంలో బ‌రిలోకి దిగిన రాణించ‌గ‌ల‌ద‌ని చాలా నిరుపించారు. చూడాలి ఈ సారి ఏ బ్యాట్స్ మెన్ ఆరెంజ్ క్యాప్ కైవ‌సం చేసుకుంటారో ? ఏ జ‌ట్టు టైటిల్ ద‌క్కించుకుంటుందో వేచి చూడాలి. 

Tags:    

Similar News