IPL 2020: కేకేఆర్ కెప్టెన్ మార్పు!?

IPL 2020: కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌.. ఐపీఎల్‌‌‌ బలమైన జట్లలో ఒక్కటి . ప్రతి సీజన్‌‌లో ప్లే ఆఫ్స్‌‌కు కచ్చితంగా వెళ్ళే టీమ్‌‌. 2012, 14 సీజన్లలో చాంపియన్‌‌గా నిలిచిన జట్టు. కానీ గత సీజన్‌‌లో ఐదో స్థానానికే పరిమితమ‌వుతుంది

Update: 2020-09-21 05:12 GMT

Eoin Morgan Can Replace Dinesh Karthik

IPL 2020: కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌.. ఐపీఎల్‌‌‌ బలమైన జట్లలో ఒక్కటి . ప్రతి సీజన్‌‌లో ప్లే ఆఫ్స్‌‌కు కచ్చితంగా వెళ్ళే టీమ్‌‌. 2012, 14 సీజన్లలో చాంపియన్‌‌గా నిలిచిన జట్టు. కానీ గత సీజన్‌‌లో ఐదో స్థానానికే పరిమితమ‌యింది. దింతో  ఈసారి భారీ ప్రణాళికలతో బరిలోకి దిగుతున్నది.ఎలాగైనా .. టైటిల్‌‌ను ముద్దాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈక్రమంలో..  కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యం ఆ జట్టు కెప్టెన్‌ ను మార్చ‌నున్న‌దా? అంటే నిజ‌మనే సమాధానాలు వ‌స్తున్నాయి. ప్రస్తుతం ఆ జట్టుకు దినేష్ కార్తీక్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గత సీజన్‌లో జట్టు కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా చేరుకోలేదు. బ్యాటింగ్, బౌలింగ్‌లో పటిష్టంగా ఉన్న.. కీలక మ్యాచ్‌లలో నాయకత్వ లోపం కనిపించింది.

అయితే ఈ సీజన్‌లో జట్టులోకి కొత్తగా ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ చేరాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తొలి మ్యాచ్‌లలో సరైన ప్రదర్శన చేయకపోతే, దినేష్ కార్తీక్ స్థానంలో ఎయోన్‌ మోర్గాన్ ‌ను జట్టు కెప్టెన్‌గా నియమించవచ్చని టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అన్నారు. ఎందుకంటే మేము ఎల్లప్పుడూ ఆ సంక్లిష్టతను కలిగి ఉన్నామని ఆయన చెప్పారు. "మిడిల్-ఆర్డర్‌కు మోర్గాన్ చేరిక కేకేఆర్‌కు మరింత స్థిరత్వం మరియు అనుభవాన్ని చేకూర్చిందని గవాస్కర్ అన్నారు. గ‌తేడాది రాజస్థాన్ రాయల్స్ జట్టు సీజన్ మధ్యలో రహానేను కెప్టెన్‌గా తప్పించి స్టీవ్ స్మిత్‌ కు కట్టబెట్టారని ప్ర‌స్త‌వించారు. మొదటి నాలుగైదు మ్యాచ్‌లు చూసిన అనంతరం కేకేఆర్ యాజమాన్యం ఒక నిర్ణయానికి రావొచ్చని తెలిపారు.

Tags:    

Similar News