IPL 2020: పంజాబ్ 'కింగ్స్', ఢిల్లీ 'యువ' ఆట్లగాళ్ల పోరు నేడే
IPL 2020: ఐపీఎల్ క్రికెట్ అభిమానులకు నిజంగా ఓ పండుగే. అభిమాన బ్యాట్ మెన్స్ భారీ హిట్టింగులు. రాకెట్ వేగంతో బంతులు విసిరే బౌలర్లు. ఒళ్లు గగుర్లు పొడిచే ఫీల్డింగ్ విన్యాసాలు మరెన్నో.. నిన్న జరిగిన తొలి పోరు చివరివరకూ ఉత్కంఠగా జరిగింది.
IPL 2020: ఐపీఎల్ క్రికెట్ అభిమానులకు నిజంగా ఓ పండుగే. అభిమాన బ్యాట్ మెన్స్ భారీ హిట్టింగులు. రాకెట్ వేగంతో బంతులు విసిరే బౌలర్లు. ఒళ్లు గగుర్లు పొడిచే ఫీల్డింగ్ విన్యాసాలు మరెన్నో.. నిన్న జరిగిన తొలి పోరు చివరివరకూ ఉత్కంఠగా జరిగింది. ముంబాయి ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్ మధ్య జరిగి హోరాహోరీ పోరులో చెన్నై అద్బుత విజయం సాధించింది. ఐపీఎల్ 2020లో రెండో రోజు..ఆదివారం రాత్రి (నేడు) దుబాయ్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడనున్నాయి.
ఈ రెండు జట్ల బలబలాలను పరిశీలిస్తే.. ఐపీఎల్ 2019 సీజన్‌లో ఈ రెండు టీమ్ లు రెండు మ్యాచ్‌ల్లో తలపడిగా.. పంజాబ్, ఢిల్లీ.. చెరో మ్యాచ్‌లో గెలుపొందాయి. అయితే.. గత సీజన్లతో పోలిస్తే.. ఈ రెండు జట్ల బలాబలాలు సమానంగా ఉన్నాయి. ఈ ఏడాది కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ నాయకత్వంలో పంజాబ్ సేన రంగంలోకి దిగనున్నది. ఈ టీంలో.. క్రిస్‌గేల్, గ్లెన్ మాక్స్‌వెల్, నికోలస్ పూరన్ వంటి పవర్ హిట్టర్లు ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగంలో కూడా మహ్మద్ షమీ, షెల్డన్ కాట్రెల్, గౌతమ్ వంటి మేటీ బౌలర్లతో టీం పటిష్టంగా ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్ పేరు మారిన తరువాత కొద్దిగా లక్ కూడా మారిందనే చెప్పాలి. యువ ఆటగాళ్ల అద్భుతమైన ఆటతీరుతో మంచి ఫాంలో ఉంది. ఈ టీంలో పృథ్వీ షా, సిమ్రాన్ హిట్‌మెయర్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్‌లతో మిడిలార్డర్ బలోపేతంగా ఉంది. అటు బౌలింగ్ విభాగంలో ఇషాంత్ శర్మ, కగిసో రబాడ, కీమో పాల్, అశ్విన్ వంటి బౌలర్లతో ప్రత్యర్థి జట్లకు మంచి పోటీని ఇవ్వనున్నది. గత ఏడాది ప్లేఆఫ్‌కి చేరి.. టైటిల్‌కి రెండు అడుగుల దూరంలో నిలిచిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.