IPL 2020: నేడే చెన్నై, రాజస్థాన్‌ల పోరు.. గెలుపెవ‌రిదో!?

IPL 2020: ఐపీఎల్‌2020 మరో ఉత్కంఠ పోరుకు రంగం సిద్దమైంది. షార్జా వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్ లు‌ తలపడనున్నాయి. తొలి మ్యాచ్ లో గెలుపు పొంది ఆత్మ విశ్వాసంతో ఉన్న చెన్నైకి ఇది రెండో మ్యాచ్‌ కాగా.. రాజస్థాన్‌కు ఇదే మొదటి మ్యాచ్.

Update: 2020-09-22 09:40 GMT

IPL 2020: Chennai Super కింగ్స్,   Rajasthan Royals

IPL 2020: ఐపీఎల్‌2020 మరో ఉత్కంఠ పోరుకు రంగం సిద్దమైంది. షార్జా వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్ లు‌ తలపడనున్నాయి. తొలి మ్యాచ్ లో గెలుపొంది.. ఆత్మ విశ్వాసంతో ఉన్న చెన్నైకి ఇది రెండో మ్యాచ్‌ కాగా.. రాజస్థాన్‌కు ఇదే మొదటి మ్యాచ్. మ‌రో విజ‌యంతో పాయింట్ల దూసుకెళ్లాల‌ని ధోని సేన చూస్తుండ‌గా.. తొలి మ్యాచ్‌లో గెలిచి టోర్నీని శుభారంభం చేయాలని రాజ‌స్థాన్ వేచి చూస్తుంది.

చెన్నైలో కీలక ఆటగాడు, మిస్ట‌ర్ ఐపీఎల్ సురేష్‌ రైనా లేని లోటును హైద‌రాబాదీ ఆటగాడు అంబటి రాయుడు భర్తీ చేస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో చెన్నై గెలుపు పొంద‌డంలో అంబటి కీల‌క పాత్ర పోషించాడు. తొలి మ్యాచ్‌లో షేన్‌ వాట్సన్‌, మురళీ విజయ్‌ విఫలమైనారు . కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం టీం వారి నుంచి భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది.  అలాగే  ధోని, కేదార్‌ జాదవ్‌లు కూడా బ్యాట్‌ ఝళిపించే అవ‌కాశం ఉంది. వారు చెల‌రేగితే.. చెన్నై స్కోరు బోర్డు ప‌రుగులు పెట్ట‌డం ఖాయం.

చెన్నైబౌలింగ్‌లోనూ చాలా ప‌టిష్టంగా ఉంది. దీపక్‌ చాహర్‌, ఎంగిడి, చావ్లా, జడేజా, సామ్‌ కరణ్‌లు త‌మ బౌలింగ్ తో ప్రత్యర్థి జట్ల ఆట‌గాళ్ల‌ను క‌ట్టుదిట్టం చేయగ‌ల‌రు. ఈ  మ్యాచ్ కు  జట్టులో ఎలాంటి మార్పులు చేయ‌కుండా అలాగే.. బరిలోకి దిగాలని ధోని భావిస్తున్నాడట.

ఇక రాజస్థాన్ రాయ‌ల్స్‌‌కి ఇదే తొలి మ్యాచ్‌. ఆ జట్టు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ తొలి నాయ‌క‌త్వంలో టీం బ‌ల‌నిరూప‌ణ కోసం వేచి చూస్తుంది. చెన్నై పై అలాగానైనా  విజయం సాధించి శుభారంభం చేయల‌ని భావిస్తుంది. కానీ ఈ మ్యాచ్‌లో స్టార్ ఆట‌గాళ్లు దూరం కానున్నారు. తొలి మ్యాచ్‌కు ఆ జట్టు స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ జోస్ బట్లర్‌ దూరం కానున్నాడు. అతడి క్వారంటైన్‌ వ్యవధి ఇంకా పూర్తి కాలేదు.  తాజాగా కాంకషన్ టెస్ట్ క్లియర్ చేయడంతో చెన్నైతో మ్యాచ్‌ ఆడేందుకు స్మిత్‌కు మార్గం సుగమమైంది. కాగా.. ఈ జ‌ట్టులో మరో కీల‌క ఆట‌గాడు బెన్ స్టోక్స్‌.. లీగ్‌లో ఆడడంపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అసలు జట్టులో చేరతాడో లేదో యాజమాన్యానికే తెలియని పరిస్థితి. ఇత‌డు జ‌ట్టుకు దూరం కావడం ఇబ్బందికర ఆంశ‌మే. ఈ జ‌ట్టుకు రహానే దూరం కావ‌డం కూడా రాజస్థాన్‌కు మ‌రోదెబ్బనే.

 ఈ తరుణం లో .. టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు ఉతప్ప, యువ ఆటగాడు సంజు శాంసన్‌, డేవిడ్‌ మిల్లర్‌, రియాన్‌ పరాగ్‌, జోప్రా అర్చర్‌ లతో కూడిన రాజస్థాన్‌.. చెన్నైకు ఏవిధంగా రాణిస్తుందో వేచి చూడాలి  

Tags:    

Similar News