IPL 2020: అక్షర్ పటేల్ రిటర్న్ గిఫ్ట్
IPL 2020: ఐపీఎల్ యువ టాలెంట్ క్రికెటర్లకు కేరాఫ్ మారింది. తమ టాలెంట్ తో ఓవర్ నైట్ లో స్టార్‌లు మారుతున్నారు. తాజా ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ శనివారం రాత్రి చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో తన భారీ హిట్టింగ్‌తో అందర్నీ దృష్టిని ఆకర్షించాడు.
IPL 2020: ఐపీఎల్ యువ టాలెంట్ క్రికెటర్లకు కేరాఫ్ మారింది. తమ టాలెంట్ తో ఓవర్ నైట్ లో స్టార్‌లు మారుతున్నారు. తాజా ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ శనివారం రాత్రి చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో తన భారీ హిట్టింగ్‌తో అందర్నీ దృష్టిని ఆకర్షించాడు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ విజయం సాధించాలంటే... చివరి 6 బంతుల్లో 17 పరుగులు అవసరం. దాదాపు చెన్నై విజయం ఖాయం అనుకున్నారు. ఇక్కడే ఓ మ్యాజిక్ జరిగింది. అసలు చివరి ఓవర్లో డ్వేన్ బ్రావో బౌలింగ్ చేయాలి. కానీ గాయం కారణంగా బ్రావో మైదానం వీడటంతో జడేజాతో బౌలింగ్ చేయించడంతో చెన్నైభారీ మూల్యం చెల్లించుకోవాల్సివచ్చింది. తొలి బంతిని జడేజా వైడ్ రూపంలో విసిరేశాడు. ఆ తర్వాత బంతికి శిఖర్ ధావన్ సింగిల్ తీయగా.. రెండో బంతి నుంచి అక్షర్ పటేల్ వరుసగా 6, 6, 2, 6 బాదేశాడు. దీంతో ఒక బంతి మిగిలి ఉండగానే టీమ్‌ని గెలిపించాడు.
దీంతో అక్షర్ పటేల్ బ్యాటింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. దాంతో.. 2016 నాటి మ్యాచ్‌ని ప్రస్తావిస్తూ.. అక్షర్ పటేల్ నాలుగేళ్ల తర్వాత ధోనీకి అదే తరహాలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. తాజా విజయంతో పాయింట్ల పట్టికలో ఏడు విజయాలతో ఢిల్లీ అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. చెన్నై టీమ్ ఆరో ఓటమితో ప్లేఆఫ్ ఆశల్నిసంక్లిష్టం చేసుకుంది.
ఐపీఎల్ 2016 సీజన్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌కి ధోనీ ఆడగా.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున అక్షర్ పటేల్ మ్యాచ్‌లు ఆడాడు. లీగ్ దశ ఆఖరి మ్యాచ్‌లో పుణె విజయానికి చివరి 6 బంతుల్లో 23 పరుగులు అవసరమవగా.. అక్షర్ పటేల్ వేసిన ఓవర్‌లో తొలి బంతిని డాట్ చేసిన అక్షర్.. రెండో బంతిని వైడ్ రూపంలో విసిరేశాడు. ఆ తర్వాత వరుసగా ఐదు బంతుల్ని ధోనీ 6, 0, 4, 6, 6గా మలిచేసి పుణెని గెలిపించాడు.