ఐపీఎల్ సీజన్-13కి గురువారం వేలం జరుగుతోంది. ఈ వేలంలో స్వదేశీ క్రికెటర్లు ఎక్కువ ధర పలుకుతున్నారు. భారత క్రికెటర్ల విషయానికి వస్తే యూసఫ్ పఠాన్ కు కోనుగోలు చేయలేదు.
*యశస్వీ జైస్వాల్ మరో సంచలనం సృష్టించాడు. 17ఏళ్ల ఈ క్రికెటర్ కోసం రాజస్థాన్ రాయల్స్ తీవ్రపోటీ పడి రూ.2.40కోట్లకు దక్కించుకుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
* స్పిన్నర్ వరణ్ చక్రవర్తిని రూ.4 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది.
*టీమిండియా ఆండర్ -19 కెప్టెన్ ప్రియమ్ గార్గ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ప్రియమ్ గార్గ్ కోసం సన్‌రైజర్స్ తో క్రింగ్స్ ఎలెవన్ తీవ్రంగా పోటీపడింది. ఎట్టకేలకు ప్రియమ్ గార్గ్‌ను రూ.1.90 సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది.
* జార్ఖండ్ యువ ఆటగాడు విరాట్ సింగ్‌ను సైతం సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.1.90 కోట్లకు కోనుగోలు చేసింది.
* రాహుల్ త్రిపాఠిని కోల్‌కతా రూ.60 లక్షలకు దక్కించుకుంది.
* టీమిండియా మరో యువ ఆటగాడు దీపక్ హుడాను రూ. 50లక్షలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ దక్కించుకుంది.
* వికెట్ కీపర్ అనుజ్ రావత్‌ను 80లక్షల రూపాయలకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది.
He's just been bought by the Rajasthan Royals at the IPL auction.
— ICC (@ICC) December 19, 2019
Get to know Yashasvi Jaiswal, who is just 17! pic.twitter.com/v2BjOo6ym6
*ఈ వేలంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కేరీని రూ.50లక్షల కనీస ధర నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2.4 కోట్లకు కోనుగోలు చేసింది.
*ఆస్ట్రేలియా ఫేస్ బౌలర్ కౌల్టర్ నైల్‌ను ముంబై ఇండియన్స్ రూ.8 కోట్లకు దక్కించుకుంది.
*వెస్టిండీస్ బౌలర్ షెల్డన్ కాట్రెల్‌ను భారీ మొత్తం వెచ్చించి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ. 8.5 కోట్లకు కొనుగోలు చేసింది.
* భారత జట్టు ఆల్ రౌండర్ పియూష్ చావ్లా కోసం చైన్నె సూపర్ కింగ్స్ రూ.6.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. పియూష్ చావ్లా కోసం ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పోటీపడ్డాయి. చివరి నిమిషంలో చైన్నె కోనుగోలు చేసింది.
*జయదేవ్ఉనద్కత్ మళ్లీ రాజస్థాన్ రాయల్స్ జట్టు దక్కించుకుంది. రూ.1కోటి ధర నుంచి రూ.3 కోట్లకు కోనుగోలు చేసింది. ఈ వేలంలో ఉనద్కత్ కోసం కింగ్స్ ఎలెవన్ పోటీపడింది. గతంలో 2019 సీజన్ లో 8.40కోట్లు పెట్టి రాజస్థాన్ ఉనద్కత్ తీసుకున్న సంగతి తెలిసిందే.
*ఆస్టేలియాన్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్10 కోట్ల 75 లక్షలకు పంజాబ్ కొనుగోలు చేసింది.
*ఆస్టేలియాన్ ఆల్ రౌండర్ ప్యాట్ కమిన్స్ సంచలనం సృష్టించాడు. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ అన్ని సీజన్లలో అత్యధిక వేలం యువరాజ్ సింగ్ రూ.16 కోట్లతో ఉన్నాడు. 2015లో ఢిల్లీ జట్టుభారీ ధరకు దక్కించుకుంది. యూవీ తర్వాతీ స్థానంలో కమిన్స్ కోల్‌కతా రూ.5.50 నిలిచాడు. 2017లో పుణె రూ.4.50 కోట్లకు కమిక్స్ ను కొనుగోలు చేసింది. తాజాగా కమిన్స్‌కు రూ.15.50 కోట్లు ధర పలికాడు. రూ.2 కోట్ల కనీస ధర మొదలు నుంచి రూ.15.50 కోట్లకు పలికాడు. బెంగళూరు, కోల్‌కత్తా ఢిల్లీ జట్లు అతడిని కోనుగోలు చేసేందుకు పోటీపడ్డాయి.చివరికి కోల్‌కతాకు 15.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.