ఐపీఎల్‌ ఫైనల్ : నాలుగోసారి కప్పుపై కన్నేసిన చెన్నై - ముంబై

Update: 2019-05-12 04:46 GMT

ఐపీఎల్‌ 12 ఫైనల్ స్టేజి కి చేరిపోయంది .ఎనమిది జట్ల మధ్య 50 రోజులు జరిగిన ఈ ఉత్కంఠ పోరులో రెండు జట్లు మాత్రమే మిగిలాయి . ఇందులో ఓ జట్టు పది సీజన్లలో ఎనిమిదోసారి ఫైనల్లో ఆడుతుంటే.. మరో జట్టుది గత ఆరేళ్లలో మూడు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఘన చరిత్ర ఉంది . మరి ఇప్పుడు నెగ్గేది ఎవరు ? ఈ అంతిమ సమరానికి హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది .

ఈ సీజన్లో రెండు జట్ల బలాబలాలు చూస్తే ముంబయిదే పైచేయిగా ఉన్నట్టుగా కనిపిస్తుంది . ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 27 మ్యాచ్‌ల్లో తలపడితే.. ముంబయి 16 సార్లు గెలిచింది. చెన్నై 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక ఈ సీజన్ లో జరిగిన మ్యాచ్ లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ముంబయిదే పైచేయి సాధిచింది . ఇదే ముంబై కి కొంచం కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు . అయితే ఎ దశలోనూ చెన్నైని తక్కువ అంచనా వేయలేం కూడా ..

ఇక ఇరు జట్ల బలాబలాలు ఒక్కసారి విశ్లేషించుకుంటే ముంబాయికి ఇటు బ్యాటింగ్ విభాగంలోను అటు బౌలింగ్ విభాగంలోను ఆదరగోట్టడం కలిసొచ్చే అంశంగా పేర్కొనవచ్చు . ఓపెనర్లు రోహిత్ శర్మ ‌, డికాక్‌ ఇక మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌, కృణాల్‌, పొలార్డ్‌లతో బ్యాటింగ్‌ లైనప్ బలంగానే ఉంది. ముఖ్యంగా ఇందులో హార్దిక్‌, పొలార్డ్‌ విధ్వంసకర ఆటతో హోరెత్తిస్తున్నారు. ఇక బౌలింగ్ విషయానికి వచ్చేసరికి బుమ్రా, మలింగ ఉండటం ముంబయి తిరుగులేని బలం. లెగ్‌ స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ కూడా చక్కటి ప్రదర్శనతో ముంబయి విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఇక చెన్నై విషయానికి వస్తే చెన్నైకి ముందు నుండి ధోనినే అతి పెద్ద బలం. చెన్నై అన్ని విజయాలలో ధోనిదే కీ రోల్ .. చెన్నై జట్టులో వాట్సన్‌, డుప్లెసిస్‌లలో ఎవరు ఒకరు చెలరేగుతున్నారు . వీళ్ళకి తోడు సురేశ్‌ రైనా, అంబటి రాయుడు చెలరేగితే చెన్నైని ఆపడం కష్టమే . ఇక బౌలర్ల విషయానికి వచ్చే సరికి స్పిన్ విభాగంలో చెన్నై పటిష్టంగా కనిపిస్తుంది . ఇందులో ఇమ్రాన్‌ తాహిర్‌, హర్భజన్‌,రవీంద్ర జడేజా కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెడుతూనే ఉన్నారు. ఇక ఫేసర్ దీపక్‌ చాహర్ కూడా నిలకడగా రాణించడం చెన్నైకి మరో అదనపు బలం ..

ఉప్పల్‌ స్టేడియం ఆతిథ్యమిస్తున్న ఐపీఎల్‌ ఫైనల్‌కు వరుణుడు ముప్పు ఉంటుందేమో అన్న ఆందోళన నెలకొంది. శనివారం నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో స్టేడియంలోని పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. మైదానమంతటా వర్షపు నీరు చేరగా.. దాన్ని సిబ్బంది తొలగించారు. వర్షం లేదా మరో కారణంతో ఆదివారం రాత్రి ఫైనల్‌ జరగని పక్షంలో సోమవారం మ్యాచ్‌ నిర్వహిస్తారు. 

Similar News