భజ్జీ చెంపదెబ్బ పై స్పందించిన శ్రీశాంత్!

ఐపీఎల్ 2008లో ముంబయి ఇండియన్స్ , పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది . ఈ మ్యాచ్ లో ముంబై జట్టుపై పంజాబ్ జట్టు ఘనవిజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం ఆటగాళ్ల కరచాలనం చేస్తున్న సమయంలో భారత్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ ను చెంపదెబ్బ కొట్టడం అప్పట్లో పెద్ద వివాదానికి దారితీసింది.. టీమ్‌ ఓటమి బాధలో ఉన్న హర్భజన్ మైదానంలోనే శ్రీశాంత్‌పై చేయిచేసుకోవడం అప్పట్లో ఇదో పెద్ద హాట్ టాపిక్...

Update: 2020-06-27 09:29 GMT

అయితే తాజాగా ఆ వివాదంపై శ్రీశాంత్ స్పందించాడు.. తాజాగా క్రికెట్‌ అడిక్టర్‌ అనే కార్యక్రమంలో పాల్గొన్న శ్రీశాంత్ ఈ వివాదంపై స్పందిస్తూ.. ఆ సంఘటన జరిగిన అనంతరం భజ్జీ నేను కలిసి భోజనం చేశామని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు . సచిన్ టెండూల్కర్ మధ్యవర్తిత్వం కారణంగానే మా మధ్య చెంపదెబ్బ వివాదం నిమిషాల వ్యవధిలో ముగిసిపోయిందని శ్రీశాంత్ వెల్లడించాడు.. ఆ తరవాత నేనే హర్భజన్ సింగ్ దగ్గరికి వెళ్లి మాట్లాడనని అలా మా మధ్య ఆ వివాదం ముగిసిందని, కానీ మీడియా మాత్రం దానిని పెద్దది చేసి చూపించిందని అన్నాడు.. భజ్జీ మ్యాచ్ విన్నర్ అని, నేను కేవలం అప్పుడే టీంలో సెటిల్ అవుతున్నాననీ, అతనిని ఓ సోదరుడిగా భావించనని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు.. ఇక శ్రీశాంత్ ను చెంప దెబ్బ కొట్టినందుకు గాను భజ్జీపై మ్యాచ్ రిఫరీ నిషేధం విధించాడు.

ఇక ఇటు శ్రీశాంత్ విషయానికి వచ్చేసరికి 2013లో ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌ కేసులో ఇరుకున్న శ్రీశాంత్‌ మళ్లీ జట్టులోకి రావాలని చూస్తున్నాడు. ఫిక్సింగ్‌ కేసులో బీసీసీఐ అతడిపైన జీవితకాలపు నిషేధం విధించింది. తాజాగా సుప్రీంకోర్టు ఆ కేసును పరిశీలించి నిషేధ కాలాన్ని తగ్గించాలని ఆదేశించడంతో బీసీసీఐ దానిని ఏడేళ్లకు పరిమితం చేసింది. ఆ గడువు ఈ సెప్టెంబర్ తో ముగుస్తుంది. మళ్ళీ శ్రీశాంత్ తన ఫామ్ ని నిరూపించుకుంటే జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.  

Tags:    

Similar News