కోహ్లికి మళ్ళీ అగ్రస్థానం
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్ట్ ర్యాంకింగ్స్ లో మళ్ళీ మొదటి స్థానాన్ని ఆక్రమించాడు.
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్ట్ ర్యాంకింగ్స్ లో మళ్ళీ మొదటి స్థానాన్ని ఆక్రమించాడు. ఇప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్న కోహ్లి ఆస్ట్రేలియా బాట్స్ మెన్ స్టీవ్ స్మీత్ ని వెనుకకి జరిపి తానూ మొదటి స్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన డే/టెస్ట్ మ్యాచ్ లో సెంచరీతో కదం తొక్కిన కోహ్లి మళ్ళీ తన స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
ప్రస్తుతం 928 పాయింట్లతో ముందంజలో ఉన్నాడు కోహ్లి.. అ తర్వాత 923 పాయింట్లతో స్టీవ్ స్మీత్ రెండవ స్థానంలో ఉన్నాడు. ఆ తరవాత పుజారా నాలుగోవ స్థానంలో ఉండగా, రహనే ఓ స్థానాన్ని కోల్పోయి ఆరోవ స్థానంలో ఉన్నాడు.
ఇక భారత బౌలర్లలో బుమ్రా మొదటి స్థానంలో ఉండగా, అశ్వన్, షమీ తొమ్మిది, పది స్థానాలలో నిలిచారు. ఇక అల్ రౌండర్ లలో జేసన్ హోలర్డ్, రవీంద్ర జేడేజా మొదటి రెండు స్థానాలలో కొనసాగుతున్నారు.
ఇది ఇలా ఉంటే భారత్ - విండిస్ జట్ల మధ్య రేపు మొదటి టీ 20 మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.